బంగారం ధరలు ఒక రోజు భారీగా తగ్గితే మరో రోజు బంగారం ధరలు భారీగా పెరుగుతాయి. మొన్నటి మొన్న నిన్న పెరిగిన బంగారం ధర నిన్న స్వల్పంగా తగ్గింది. ఈరోజు దేశి మార్కెట్ లో బంగారం ధరలు అసలు కదలలేదు. హైదరాబాద్ మార్కెట్ లో నేడు శుక్రవారం నిన్నటి ధరలే కొనసాగుతున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 39,860 ఉంది.
అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 36,540 రూపాయల వద్ద స్ధిరంగా ఉంది. అయితే బంగారం ధరలు స్ధిరంగా కొనసాగాయి వెండి ధర కూడా అలాగే స్ధిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్ మార్కెట్ లో కేజీ వెండి ధర 46,900 రూపాయల వద్ద స్ధిరంగా కొనసాగుతుంది. అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ స్వల్పంగా కొనసాగటం వల్లే బంగారం ధర స్థిరంగా ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అలాగే విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశావహ దృక్పథం కారణంగా బంగారం, వెండి స్థిరంగా కొనసాగుతూ వస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. వాల్‌స్ట్రీట్ సరికొత్త గరిష్ఠ స్థాయిలు నమోదు చేయడం కూడా ఇన్వెస్టర్లను బంగారం పెట్టుబడులకు దూరం చేసింది.
అందుకే రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం బంగారం, వెండి కొనాలనుకునేవారు వెంటనే కోనేయండి. ఎందుకంటే ఇప్పుడు ధరలు తక్కువతో పాటు స్థిరంగా కూడా కొనసాగుతున్నాయి. మళ్ళి రేపు బంగారం ధర ఎంత పెరుగుతుందో చెప్పలేని పరిస్థితి.