
ప్రస్తుతం ప్రతి ఒకరికి బ్యాంకులలో కచ్చితంగా ఖాతా ఉంటుంది. ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్‌లో అకౌంట్ కలిగిన వారికి బ్యాంక్ నుంచి ఒక అలర్ట్. బ్యాంక్ తాజాగా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించడం జరిగింది. ఇప్పటికే ఈ నిర్ణయం అమలులోకి కూడా రావడం జరిగింది. ఈ నిర్ణయం నవంబర్ 20 నుంచే అమలులోకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో బ్యాంక్‌లో డిపాజిట్ చేసే వారు కొత్త వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం చాల మంచిది.
ఐసీఐసీఐ బ్యాంక్ దాదాపు 16 మెచ్యూరిటీ ఆప్షన్లతో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకునే అవకాశం ఇస్తుంది. రూ.2 కోట్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంది. 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు మీ డబ్బులను బ్యాంక్‌లో అలాగే ఉంచుకునే అవకాశం ఉంది. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై 4 నుంచి 6.6 శాతం మధ్యలో వడ్డీ రేటును ఇస్తుంది. ఇది సాధారణ ప్రజలకు వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్స్‌కు ఇంకా ఎక్కువగా వడ్డీరేటును అందిస్తుంది. వీరికి 4.5 శాతం నుంచి 7.10 శాతం మధ్యలో వడ్డీ రేటును అందించడం జరుగుతుంది అని ఐసిఐసిఐ బ్యాంక్ తెలిపింది.
ఐసీఐసీఐ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్లపై ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి అంటే నమ్మండి. 5 నుంచి 10 ఏళ్ల లాకిన్ పీరియడ్ ఉన్న డిపాజిట్లపై ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు కూడా ఉంది. ఇకపోతే ఐసీఐసీఐ బ్యాంక్ కన్నా ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి దిగ్గజ బ్యాంకులు కూడా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించడం కూడా జరిగాయి. ఇప్పుడు వీటి సరసన ఐసీఐసీఐ బ్యాంక్ వచ్చి చేరడం జరిగింది. వడ్డీ రేట్లను పూర్తిగా చూసుకొని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది.