ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సీనియర్ సిటిజన్లకు రైలు టికెట్లలో మినహాయింపు పొందే సౌకర్యాన్ని కల్పించింది. 58 సంవత్సరాలు ఆ పై వయస్సు గల మహిళలు, 60 సంవత్సరాల వయస్సు పై బడిన పురుషులు ఈ డిస్కౌంట్ ను పొందవచ్చు. జన్ శతాబ్ది, రాజధాని, ఎక్స్‌ప్రెస్, మెయిల్ వంటి రైళ్లలో టికెట్ ధరలపై ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది.
ఐఆర్‌సీటీసీ సీనియర్ సిటిజన్లతో పాటు విద్యార్థులు, మీడియా ప్రతినిధులు, యుద్ధంలో భర్తను కోల్పోయిన మహిళలు, క్రీడాకారులు టికెట్ ధరపై రాయితీని పొందవచ్చని ఐఆర్‌సీటీసీ గతంలో చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. irctc e tickeing, www.irctc.co.in వెబ్ సైట్ లో ట్రైన్ టికెట్ బుకింగ్స్ పై రాయితో పొందవచ్చు. రిజర్వేషన్ ఆఫీసుల్లో, రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్స్ లో కూడా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
రైలు టికెట్ ధరపై మహిళలు 50 శాతం వరకు, పురుషులు 40 శాతం వరకు టికెట్ పై రాయితీ పొందవచ్చు. రైలులో ప్రయాణించే టికెట్ బుకింగ్ రాయితీ పొందిన వారు తప్పనిసరిగా వయసు ధ్రువీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి. అర్హత ఉండి టికెట్ పై రాయితీ పొందాలనుకునే వారు ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ లోకి వెళ్లి avail concession అనే ఆప్షన్ క్లిక్ చేసి డిస్కౌంట్ పొందవచ్చు. ఒకసారి టికెట్ బుక్ చేస్తే ఆ తరువాత మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉండదు.