ఎస్‌బీఐలో డబ్బులు పెడితే అదిరిపోయే రాబడి పొందొచ్చు. ఎస్‌బీఐ షేరు ధర ఇటీవల కాలంలో రూ.290 స్థాయి నుంచి రూ.335 స్థాయికి పరుగులు పెట్టింది. ఎస్‌బీఐ స్టాక్ పెరుగుదలకు ప్రధాన కారణం బ్యాంక్ బలమైన ఫండమెంటల్స్. దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు స్టేట్ బ్యాంక్‌పై విశ్వాసంతో ఉన్నారు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల ప్రకారం చూస్తే.. ఎస్‌బీఐ షేరు ధర ర్యాలీ చేసే అవకాశముంది. మార్కెట్ నిపుణులు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నారు.
 
ప్రస్తుతం ఎస్‌బీఐ షేరు ధర రూ.336 సమీపంలో కదలాడుతోంది.ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ నివేదిక ప్రకారం.. గత కొన్నేళ్లుగా ఎస్‌బీఐ షేరు ఒక మోస్తారు పనితీరు కనబరుస్తూ వస్తోంది. షేరు ధర దీర్ఘకాలంలో రూ.425 స్థాయికి చేరొచ్చని అంచనా వేస్తున్నారు. . అంటే స్టాక్‌‌పై మోతీలాల్ ఓస్వాల్ బుల్లిష్‌గానే ఉందని చెప్పుకోవచ్చు. దీర్ఘకాల లక్ష్యంతో ఎస్‌బీఐ షేరును కొనుగోలు చేయవచ్చు.స్టేట్ బ్యాంక్ బలమైన ఎర్నింగ్స్ పెరుగుదలను నమోదు చేసేందుకు రెడీ ఉంది. ఎస్సార్ దివాలా పరిష్కారం కావడం, ఇతర బకాయిల రికవరీ వంటి అంశాలు బ్యాంక్ షేరుపై సానుకూల ప్రభావం చూపుతున్నాయి. టెక్నికల్‌గా చూస్తే స్టాక్ కొనొచ్చన్నారు.
 
సెబీ రిజిస్టర్డ్ టెక్నికల్ ఈక్విటీ ఎనలిస్ట్ సిమీ భూమిక్ మాట్లాడుతూ.. ఎస్‌బీఐ షేరు బుల్లిష్‌గా కనిపిస్తోందన్నారు. టెక్నికల్ చార్ట్స్ ప్రకారం చూస్తే ఎస్‌బీఐ షేరు రూ.325 నుంచి రూ.365 స్థాయిలో కదలాడుతోందని తెలిపారు. ఎస్‌బీఐ షేరు రూ.10 నుంచి రూ.12 తగ్గితే కొనొచ్చని భూమిక్ తెలిపారు. రూ.360 స్థాయి వద్ద ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చని సూచించారు. స్వల్పకాల లక్ష్యంతో ఉన్న ఇన్వెస్టర్లక ఇది వర్తిస్తుందని తెలిపారు. నెల రోజుల కాలంలో ఎస్‌బీఐ షేరు ధర రూ.360కి చేరొచ్చని పేర్కొన్నారు.
 
స్టేట్ బ్యాంక్ షేరు ధర రూ.365 స్థాయికి దాటితే మరింత పెరగొచ్చని భూమిక్ అంచనా వేశారు. రూ.365 స్థాయి తర్వాత ఎస్‌బీఐ షేరు ధర రూ.385 నుంచి రూ.390 స్థాయికి పెరగొచ్చని తెలిపారు. అయితే ఎస్‌బీఐ షేరుకు రూ.320 వద్ద స్టాప్ లాస్ పెట్టుకోవాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: