ప్రస్తుతం రోజురోజుకూ బైక్ వినియోగదారులు బాగా పెరిగి పోతున్నారు. ప్రజలు కొత్త వాహనాలతో పాటు సెకండ్ హ్యాండ్ వాహనాల కొనుగోలు కూడా చాల జోరుగా కొనసాగుతున్న తరుణం మనం చూస్తూ ఉన్నాము. ఇది ఇలా ఉండగా నిపుణులు మాత్రం బైక్ అమ్మేటప్పుడు గానీ, పాత బైక్ కొనేటప్పుడు కూడా జాగ్రత్తలు నాగ తీసుకోవాలని తెలుపుతున్నారు. ఒక వేళా మీరు ఇతరులకు బైక్ అమ్మేటప్పుడు సేల్ అగ్రిమెంట్ ఇతర పత్రాలు అన్ని కూడా సరిగా చూసుకోకుంటే ఆ తర్వాత ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు. తాజాగా పోలీసులు ఈ చలానా వేస్తూ ఉండంతో కూడా ఇబ్బందులు చాల ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉన్నాయి.
ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది మీరు పాత వాహనాన్ని అమ్మిన సమయంలో కేవలం చిన్న బాండ్ పేపర్‌తో విక్రయం గురించి ఒప్పు కొని విక్రయిలు నిర్వహిస్తారు. కానీ ఆ వాహనాన్ని కొన్న వ్యక్తి తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అలాగే వాహనాన్ని నడిపిస్తే అమ్మిన వ్యక్తి పేరున ఉన్న చలానాల భారం బాగా ఎక్కువగా పడుతుంది. ఇలాంటి విషయాలలో సేల్ డీడ్ అగ్రిమెంట్ డాకుమెంట్స్ పెట్టుకోవడం చాల మంచిది. ఇలాంటి వ్యవహారా ల్లో చాలా మందికి సరైన అవగాహన లేకపోవడంతో బాగా ఇబ్బందులు ఎదురు కుంటున్నారు. ఇలా జరగడంతో అమ్మిన వారితో పాటు కొన్నవారు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఇలా వాహనాల విక్రయాల కోసం 29, 30 ఫారాలే ముఖ్యంగా ఉండాలి. ఇంకా ఇలాంటి ఫారాలే కాకుండా వాహనాలు కొనుగోలు చేసుకున్న వెంటనే ఆర్సీ, ఇన్స్యూరెన్సు, కాలు ష్యం, చిరునామా లాంటి ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు పెట్టించుకోవడం చాలా మంచిది అని అధికారులు తెలియచేస్తున్నారు. ఒక వేళా మీరు కొత్తగా మరో వాహనం కొంటే పన్నుల రూపంలో అదనపుగా డబ్బులు కట్టవలిసిన అవసరం ఉంది. అలాగే వాహనాన్ని అమ్మిన వెంటనే ఇద్దరి వైపులా యాజమాన్య హక్కులను స్పష్టంగా మార్చుకోవాలని అధికారులు స్పష్టంగా వెల్లడిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం వాహనాలు కొనుగోలు చేసుకుంటున్నప్పుడు తగిన జాగ్రత్తలు పాటించి ఇబ్బందులు రాకుండా చూసుకోండి