ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ ఐన శాంసంగ్ మరో బడ్జెట్ మొబైల్ ను విడుదల చేయడం జరిగింది. శాంసంగ్ గెలాక్సీ ఏ01 పేరిట లాంచ్ కానున్న ఈ బడ్జెట్ మొబైల్ ఫీచర్లలో శాంసంగ్ తెలియచేయడం జరిగింది. ఇక శాంసంగ్ తన వెబ్ సైట్ లో పెట్టిన ఫొటో ఆధారంగా దీని డిజైన్ గురించిన వివరాలు మనం అర్థం చేసుకోవచ్చు. కానీ దీని ధర, ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే అంశాన్ని శాంసంగ్ ఇప్పటివరకు తెలియచేయలేదు. అయితే దీని ధర రూ.6,999గా ఉండనుందని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.
శాంసంగ్ విడుదల చేసిన ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 5.7 అంగుళాల హెచ్ డీ+ ఇన్ ఫినిటీ-వి డిస్ ప్లేను వాడడం జరిగింది. ఈ ఫోన్ఆ క్టాకోర్ ప్రాసెసర్ పై పని చేయపోతుంది. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో విడుదల చేయడం జరుగుతుంది. ఇంకా మీరు స్టోరేజ్ ను పెంచుకోవడానికి ప్రత్యేకంగా మైక్రోఎస్ డీ కార్డును కూడా వాడుకునే అవకాశం కూడా కల్పించారు. ఫోన్ వెనక వైపు రెండు కెమెరాలను కూడా అందిచడం జరిగింది. ఇక కెమెరాల సామర్థ్యం విషయానికి వస్తే 13 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్స్ అందిచడం జరిగింది. సెల్ఫీ ప్రియుల కోసం ముందువైపు 5 మెగా పిక్సెల్ కెమెరాను కూడా ప్రవేశ పెట్టబోతున్నారు.
ఇక ఫోన్లో అతి ముఖ్యమైన బ్యాటరీ విషయానికి వస్తే.. ఇందులో 3,000 ఎంఏహెచ్ బ్యాటరీని వాడడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో అన్ని స్మార్ట్ ఫోన్లలో కనిపిస్తున్న సెక్యూరిటీ ఫీచర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇందులో లేదు అని గమనించవలసిన విషయం. ఇక శాంసంగ్ అధికారిక వెబ్ సైట్ లో తెలియచేసిన వివరాలను చూస్తే.. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, రెడ్ కలర్లలో అందుబాటులో తీసుకొని రాబోతున్నారు అని అర్థం అవుతుంది.