చాలా మంది సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త బైక్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది పండుగ సందర్భంగా కూతురికి లేదా కొడుకుకు కొత్త బండిని కొనివ్వాలని అనుకుంటూ ఉంటారు. కానీ చేతిలో తగినంత డబ్బు లేకపోవటం వలన కొత్త బైక్ కొనుగోలు చేయాలనే ఆలోచననను పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు. కానీ కొత్త బైక్ కొనుగోలు చేయాలనుకునేవారు ఎలాంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉన్న కస్టమర్లకు తక్కువ డాక్యుమెంట్లతో రుణం పొందే సదుపాయం కల్పిస్తోంది. టూ వీలర్ లోన్ ద్వారా తక్కువ వడ్డీ రేటుకు, తక్కువ డాక్యుమెంట్లతో రుణం పొందే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రిక్ టూ వీలర్, మోటార్ సైకిల్, స్కూటర్ ఎస్బీఐ టూ వీలర్ లోన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. నెలకు కనీసం 12,500 రూపాయల ఆదాయం ఉన్నవారు టూ వీలర్ లోన్ తీసుకోవడానికి అర్హులు అవుతారు.
భారతీయ పౌరసత్వం కలిగి 21 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ లోన్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ టూ వీలర్ లోన్ కింద 2.5 లక్షల రూపాయల వరకు రుణం తీసుకోవచ్చు. ఉద్యోగం చేసే వారు వారి నెల జీతం కన్నా 6 రెట్లు ఎక్కువ మొత్తాన్ని లోన్ కింద పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారాలు చేసే వారు, స్వయం ఉపాధి పొందుతూ జీవించేవారు 50 శాతం వరకు రుణాన్ని పొందే అవకాశం ఉంటుంది.
లోన్ తీసుకున్న రోజు నుండి 36 నెలల లోపు తీసుకున్న లోన్ ను తిరిగి కట్టేయాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, లిస్టెడ్ ప్రైవేట్ కంపెనీలకు చెందిన ఉద్యోగులు, కార్పొరేషస్, పీ.ఎస్.యూలకు చెందిన ఉద్యోగులు శాలరీ అకౌంట్ ఎస్బీఐలో ఉంటే ఈ లోన్ కోసం ధరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకులో ఎఫ్.డీ కలిగిన వారు, స్వయం ఉపాధి పొందుతున్న వారు, వ్యవసాయ రంగానికి చెందిన వారు కూడా ఈ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. హోం బ్రాంచుల్లో మాత్రమే ఈ రుణాలను పొందవచ్చు. https://onlineapply.sbi.co.in/personal-banking/auto-loan?se=Product&cp=SBICOIN&ag=General లింక్ పై క్లిక్ చేసి ఈ లోన్ కొరకు ధరఖాస్తు చేసుకోవచ్చు.