కొత్త సంవత్సరంలో ఇల్లు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నవారికి ప్రధాని మోదీ ఒక శుభవార్త చెప్పారు. ఇల్లు కొనుగోలు చేయటానికి వెబ్ సైట్లలోకి వెళ్లి సెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో పని లేకుండా  కేంద్రం ఒక కొత్త ఆప్షన్ ను అందుబాటులోకి తెచ్చింది. కేంద్రం రియల్టర్ల కొరకు మరియు ఇంటి కొనుగోలుదారుల కొరకు housingforall.com ను అందుబాటులోకి తెచ్చింది. 
 
ఈ వెబ్ సైట్ ను గృహ, పట్టణ వ్యవహారాల కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా లాంచ్ చేశారు. దుర్గా శంకర్ మిశ్రా మాట్లాడుతూ లాంఛ్ చేసిన వెబ్ సైట్ అమెజాన్ స్థాయికి చేరవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. హౌసింగ్ ఫర్ ఆల్ వెబ్ సైట్ ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలోని కొనుగోళ్లకు సంబంధించిన పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని మిశ్రా అభిప్రాయపడ్డారు. ప్రత్యేకమైన గ్రీవెన్స్ పరిష్కార వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామని మిశ్రా పేర్కొన్నారు. 
 
ఈ గ్రీవెన్స్ వ్యవస్థ ద్వారా కొనుగోలుదారుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. ఇంటి కొనుగోలుదారులు మరియు రియల్టర్లు హౌసింగ్ ఫర్ ఆల్ వెబ్ సైట్ ద్వారా ప్రయోజనం పొందవచ్చని మిశ్రా తెలిపారు. రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్టులు మాత్రమే ఈ పోర్టల్ లో లిస్ట్ చేస్తామని మిశ్రా తెలిపారు. ఈ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేసిన ఇళ్లకు రెరా రిజిస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఈ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేసిన ఇళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. 
 
ఈ పోర్టల్ లో పూర్తయిన ప్రాజెక్టుల వివరాలు అందుబాటులో ఉండటంతో పాటు నచ్చిన ఇంటిని వెంటనే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ డెవలపర్లకు ఫిబ్రవరి 13వ తేదీ వరకు వారి ప్రాజెక్టుల వివరాలను అప్ డేట్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ సైట్ సర్వీసులు ఫిబ్రవరి 14వ తేదీ నుండి కస్టమర్లకు అందుబాటులోకి రానున్నాయి. మార్చి 1వ తేదీ నుండి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. నచ్చిన ఇంటిని 25,000 రూపాయలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఎంపిక చేసుకున్న ఇల్లు నచ్చకపోయినా, ఏమైనా ఇబ్బందులు తలెత్తినా డబ్బును వెంటనే రీఫండ్ చేస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: