పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు భారీగా తగ్గాయి. ఆ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గటం చూస్తే వావ్ అని ఆశ్చర్యం వెయ్యాల్సిందే. ఏంటి పెట్రోల్, డీజిల్ ఇంత తగ్గాయా అని.. ఎందుకంటే.. వరుసగా గత రెండు నెలల నుండి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు నెల రోజుల నుండి భారీగా తగ్గుతున్నాయి.

 

రెండు నెలల క్రితం వరుకు 76 రూపాయిలు ఉన్న పెట్రోల్ ధర మొన్నటి వరుకు 80 రూపాయలకు చేరింది. అలాగే డీజిల్ ధర 66 రూపాయిలు ఉన్నది 75 రూపాయలకు చేరింది. అయితే ఇప్పుడు అవే పెట్రోల్, డీజిల్ ధరలు నెల రోజుల నుండి తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలోనే నేడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. ఎంత తగ్గాయి అని అనుకుంటున్నారా? 

 

నేడు బుధవారం వివిధ మెట్రో నగర్లో పెట్రోల్ ధర లీటర్ కు 17 పైసల చొప్పున తగ్గగా... డీజిల్ ధర 22 పైసలు తగ్గింది. హైదరాబద్ లో పెట్రోల్ ధర లీటర్ 17 పైసలు తగ్గుదలతో రూ. 76.45కు చేరగా, డీజల్ ధర 22 పైసలు తగ్గుదలతో 70.66 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గటమే ఇందుకు కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. 

 

కాగా పెట్రోల్, డీజిల్ ధరలు భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి అని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఏది ఏమైనా.. పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా అయితే పెరిగాయో.. అలాగే తగ్గుతూ వస్తున్నాయి. ఇది వాహనదారులకు మంచి వార్తే. 

మరింత సమాచారం తెలుసుకోండి: