రెండు రోజుల పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలకు నేడు బ్రేకులు పడ్డాయి. దాదాపు రెండు నెలల నుండి భారీగా తగ్గుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు అప్పుడప్పుడు పెరిగి షాక్ ఇస్తున్నాయి. ఆతర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు మళ్లీ తగ్గాయి. 

 

నేడు శుక్రవారం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 16 పైసలు తగ్గుదలతో 75.78 రూపాయిలకు చేరింది. అలాగే లీటర్ డీజిల్ ధర 9 పైసలు తగ్గుదలతో 69.62 రూపాయిల వద్దకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.71.09 వద్ద, డీజిల్ ధర రూ.64.08 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. 

 

ఆర్ధిక రాజధాని అయినా ముంబైలోను పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే భారీగా తగ్గాయి. పెట్రోల్ ధర 12 పైసలు తగ్గుదలతో రూ.77.60 వద్దకు చేరాయి. డీజిల్ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.67.88కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా కదిలాయి. అందుకే ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా తగ్గాయి. కాగా కేవలం రెండు నెలల్లో పెట్రోల్, డీజిల్ పై ఆరు రూపాయిలు తగ్గాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: