ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ క్రెడిట్, డెబిట్ కార్డులను వినియోగిస్తున్నారు. నేటి నుండి క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించిన కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. ఆన్ లైన్ లావాదేవీల కోసం క్రెడిట్, డెబిట్ కార్డులను వినియోగించని వారికి ఇకనుండి ఆ సర్వీసులు పని చేయవు. ఇప్పటివరకు ఆన్ లైన్ లావాదేవీలు నిర్వహించని వారికి కాంటాక్ట్‌లెస్ మరియు ఆన్ లైన్ లావాదేవీలకు సంబంధించిన సర్వీసులు నిలిచిపోయే అవకాశం ఉంది. 
 
ఆర్బీఐ రెండు నెలల క్రితం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఆర్బీఐ బ్యాంకులకు, కార్డులు జారీ చేసే సంస్థలకు ఆన్ లైన్, కాంటాక్ట్ లెస్ లావాదేవీలు నిర్వహించకపోతే క్రెడిట్, డెబిట్ కార్డు సేవలను రద్దు చేయాలని ఆదేశించింది. గతంలో ఒక్కసారైనా క్రెడిట్, డెబిట్ కార్డులు వినియోగించి ఉంటే ఈ సర్వీసులు పని చేస్తాయి. కార్డులు జారీ చేసిన సంస్థలు జారీ అయిన కార్డులకు సంబంధించిన ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు. 
 
ఆర్బీఐ పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్ లోని సెక్షన్ 10(2) ప్రకారం ఈ ఆదేశాలను జారీ చేసింది. గత కొన్నేళ్లుగా క్రెడిట్, డెబిట్ కార్డులు వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆర్బీఐ వినియోగదారులకు మెరుగైన మరియు సురక్షితమైన సేవలు అందించాలనే ఆలోచనతో నూతన నిబంధనలను జారీ చేసింది. అతి త్వరలో డెబిట్, క్రెడిట్ కార్డ్ యూజర్లకు కొత్త సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. 
 
అతి త్వరలో డెబిట్, క్రెడిట్ కార్డ్ యూజర్లకు లావాదేవీల లిమిట్స్ సెట్ చేసుకోవడం, కార్డు స్విఛ్ ఆన్, ఆఫ్ చేసుకోవడం లాంటి సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్, ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ అప్లికేషన్ ఇతర సేవలు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. కార్డు సేవలలో ఏవైనా మార్పులు చేస్తే సంబంధిత బ్యాంకు శాఖలు సందేశాల ద్వారా కస్టమర్లను అలర్ట్ చేస్తాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: