ప్రధాని మోదీ పీఎఫ్ ఖాతాదారులకు అతి త్వరలో భారీ షాక్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. కేంద్రం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ను కొందరికే పరిమితం చేయాలని భావిస్తోందని సమాచారం. మోదీ ప్రభుత్వం 15,000 రూపాయలకు పైగా బేసిక్ శాలరీ అందుకునే వారికి కంట్రిబ్యూషన్ అవసరం లేదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఈపీఎఫ్ లోకి వచ్చే వారికి ఈ నిబంధనలను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 
 
ప్రస్తుతం కేంద్రం ఈపీఎస్ ఖాతాదారులకు నెలవారీ జీతంలో 1.16 శాతాన్ని ఈపీఎస్ అకౌంట్ కు కంట్రిబ్యూట్ చేస్తోంది. కేంద్రం నెలకు 15,000 రూపాయలను ప్రామాణికంగా తీసుకోవడం వల్ల కంట్రిబ్యూషన్ 174 రూపాయలకు మించదు. కంపెనీ ఉద్యోగి ఈపీఎస్ అకౌంట్ కు బేసిక్ శాలరీ, డీఏ కలిపి ఉద్యోగి వేతనంలో 8.33 శాతం కంట్రిబ్యూట్ చేస్తోంది. కంపెనీ గరిష్టంగా 1,250 రూపాయలు కంట్రిబ్యూట్ చేసే అవకాశం ఉంటుంది. 
 
కేంద్రం తాజా సవరణల ప్రకారం ప్రభుత్వం ఉద్యోగి పెన్షన్ అకౌంట్ లో ఉద్యోగి వేతంలో 1.16 శాతానికి సమానమైన మొత్తాన్ని జమ చేస్తుంది. కేంద్రం నెలకు 15,000 రూపాయలకు పైగా వేతనం అందుకునేవారికి కంట్రిబ్యూషన్ చేయదు. ఈపీఎఫ్‌వో కేంద్రానికి కొన్ని రోజుల క్రితం సవరణల ప్రతిపాదనల్లో భాగంగా ఈ విషయాలను వెల్లడించింది. ఈ కొత్త సవరణకు సెంట్రల్ ట్రస్ట్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈపీఎస్ అకౌంట్ ద్వారా ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం పెన్షన్ ప్రయోజనాలను పొందవచ్చు. 1995 నవంబర్ 16 నుంచి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ అమలులో ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: