ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని ఉద్యోగులకు, పన్ను చెల్లింపుదారులకు శుభవార్త చెప్పారు. కేంద్రం తాజాగా పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగే విధంగా నిర్ణయం తీసుకుంది. 2020 -21 ఆర్థిక సంవత్సరంలో ఫామ్ 15 జీ, 15 హెచ్ జూన్ 30 వరకు చెల్లుబాటు అయ్యే విధంగా ప్రకటన చేసింది. తాజాగా ఈ విషయాన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు వెల్లడించింది. 
 
కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇన్వెస్టర్లు ఫామ్ 15 జీ, 15 హెచ్ లను జులై నెలలో అందించవచ్చు. సీబీడీటీ ఈ విషయాన్ని ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. గత సంవత్సరం ఇన్వెస్టర్లు ఫామ్ 15జీ, 15 హెచ్ సమర్పిస్తే జూన్ నెల చివరి వరకు చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. ఎవరైనా ఈ ఫామ్స్ వల్ల పన్ను తగ్గింపు ప్రయోజనాలను పొందకపోతే వారు మాత్రం జూన్ 30లోగా తెలియజేయాలని పేర్కొన్నారు. 
 
సాధారణంగా ఫామ్ 15 జీ, 15 హెచ్ లను ఏప్రిల్ నెల తొలి వారంలో పన్ను చెల్లింపుదారులు అందజేయాల్సి ఉంటుంది. కానీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం గడువు పొడిగించడం వల్ల చాలా మందికి ప్రయోజనం చేకూరనుంది. సీబీడీటీ నిర్ణీత గడువులోగా చాలా మంది ఫామ్ లను సమర్పించలేకపోతున్నారని చెప్పడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. సమర్పించలేకపోతే బ్యాంకులు టీడీఎస్ కట్ చేసుకునే అవకాశం ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: