లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కస్టమర్ల కోసం ఇప్పటికే ఎన్నో పాలసీలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఎల్‌ఐసీ రిటైర్మెంట్ పాలసీలు, ఎండోమెంట్ పాలసీలు, టర్మ్ పాలసీ, చిల్డ్రన్ పాలసీ, మనీ బ్యాంక్, ఇతర పాలసీలను కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది. ఎల్‌ఐసీ పాలసీలలో ఆధార్ స్తంభ్ పాలసీ కూడా ఒకటి. ఈ పాలసీ ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. 
 
రోజుకు కేవలం 28 రూపాయలు చెల్లించి 4 లక్షల రూపాయలు పొందవచ్చు. ఈ పాలసీని 8 ఏళ్ల నుంచి 55 ఏళ్లలోపు వయస్సు ఉన్న వారు ఎవరైనా తీసుకోవచ్చు. కనీసం 75,000 రూపాయల బీమా మొత్తానికి పాలసీని తీసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా మూడు లక్షల రూపాయల వరకు పాలసీని తీసుకోవచ్చు. పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఆ పాలసీ మొత్తాన్ని నామినీకి అందజేస్తారు. పాలసీ తీసుకున్న వ్యక్తి ఐదేళ్లలోపు మరణిస్తే ఈ విధంగా చేస్తారు. 
 
పాలసీదారుడు ఐదేళ్ల తర్వాత మరణిస్తే మాత్రం నామినీకి బీమా మొత్తం మరియు లాయల్టీ అడిషన్స్ కూడా లభిస్తాయి. ఉదాహరణకు 20 ఏళ్ల వయస్సు ఉన్నవారు 20 సంవత్సరాలకు మూడు లక్షల రూపాయలకు పాలసీ తీసుకుంటే ఏడాదికి 10,541 రూపాయలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంటే రోజుకు కేవలం 28 రూపాయలు ఆదా చేస్తే సరిపోతుంది. ఎల్‌ఐసీ పాలసీ గడువులోపు ప్రీమియం రూపంలో 2 లక్షల రూపాయలు చెల్లిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో 3 లక్షల రూపాయల బీమాతో పాటు 97,500 రూపాయల లాయల్టీ అడిషన్ వస్తుంది. అంటే మెచ్యూరిటీ సమయంలో ఏకంగా నాలుగు లక్షల రూపాయలు వస్తాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: