కరోనా వైరస్ అతలాకుతలం అవుతున్న పాకిస్తాన్ కొద్దిరోజులుగా లాక్‌డౌన్ పాటిస్తోంది. స్వీయ నిర్బంధంలోకి వెళ్లడంతో దేశ వ్యాప్తంగా జనసంచారం నిలిచిపోయింది. రంజాన్ మాసమైనప్పటికి అక్కడి ప్రజలు ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకుంటున్నారు. అయితే సామాజిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకుంటూ గ్రామాల్లో మస్జీదుల్లో ప్రార్థనలకు అవకాశం కల్పిస్తున్నారు. ఇదిలా ఉండగా పాకిస్థాన్‌లో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య దాదాపు 800కుపైగా ఉంది. ఇక కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 18వేలకు చేరువలో ఉండటం గమనార్హం. అయితే వైరస్ ఉధృతి అధికమైతే సరైన వైద్య సదుపాయాల్లేని పాకిస్థాన్ పరిస్థితి ఆగమాగం కానుంది.
దేశంలో వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉండటంతో ఇప్పటికే చైనా వందల సంఖ్యలో పాకిస్థాన్‌కు పంపించింది. మిగతా వాటిని అందించాలని భారత్‌ను అర్థిస్తున్నా..ఇప్పటి వరకైతే భారత్ ఎలాంటి స్పందనను తెలియజేయలేదు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ ఉధృతమవుతున్న వేళ...లాక్‌డౌన్ అమలులో ఉంచి కూడి పాకిస్థాన్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అదేమంటే పెట్రోల్‌ధరలను భారీగా తగ్గించేయడం. దేశంలో పెట్రోల్ ధరలు లీటర్‌కు రూ.60వరకు ఉండగా తాజాగా ప్రకటించనున్న ధరల ప్రకారం..38రూపాయలకే లభిస్తుందని అక్కడి డాన్ పత్రికలో కథనం ప్రచురితం కావడం గమనార్హం.
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు పతనం అవుతున్నాయి. ఈ క్రమంలో పెట్రోల్ ధరను లీటర్‌కు రూ.20మేర తగ్గించాలని పాకిస్తాన్ నిర్ణయించినట్లు డాన్‌లో కథనంలో తెలిపింది. అంతేకాకుండా వివిధ రకాల ఆయిల్ ఉత్పత్తులను ప్రస్తుతం ఉన్న ధరల మీద 57 శాతం వరకు తగ్గించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా బ్యారెల్ ధర రోజురోజుకు పడిపోవడంతో గల్ఫ్ దేశాలు ఆయిల్ వెలికితీతను పూర్తిగా నిలిపివేశాయి. ధరలు తగ్గకుండా తీర్మానాలు చేసుకున్నా పతనమవుతూనే ఉన్నాయి. ఈ చర్య ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple