కరోనా వైరస్ ఉధృతితో లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో భారతీయ వ్యాపార రంగాలన్ని కూడా కుదేలయ్యాయి. అన్ని రంగాల మాదిరిగానే పర్యాటక రంగంపైనా తీవ్రమైన ప్రభావమే పడిందని చెప్పాలి. పర్యాటక రంగంతో అనుబంధం ఉన్న అన్ని రంగాలు తీవ్ర నష్టాలను మూటగట్టుకున్నాయి. మహమ్మారి కోవిడ్-19 కారణంగా భారతీయ పర్యాటక రంగం రూ.10 లక్షల కోట్లు నష్టపో యిందని పర్యాటక రంగ సమాఖ్య ఫెడరేషన్ ఆఫ్ అసొసియేషన్స్ ఇన్ ఇండియన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ(ఎఫ్‌ఏఐటీహెచ్) ఒక ప్రకటనలో తెలిపింది. సుమారు రూ.5 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్టు గతంలో ప్రకటించింది.
అయితే లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో ఆ నష్టం రూ.10 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసింది. లాక్‌డౌన్ ఆంక్షల కొనసాగింపుతో దేశీయంగా, అంతర్జాతీయంగా పర్యాటక సేవలు నిలిచిపోవడంతో నష్ట అంచనాలో మార్పులు చేయాల్సి వచ్చిందని ప్రకటనలో తెలిపింది. కరోనాతో నష్టాల బాటలో పయనిస్తున్న ఉద్దీపన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని ఫెయిత్ ప్రతినిధి ఒకరు తెలిపారు. పర్యాటకం, ఆతిథ్యం రంగాలను గట్టెక్కించేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని కూడా ఇప్పటికే విన్నవించామని పేర్కొన్నారు. పర్యాటక రంగం పుంజుకునేలా చేసేందుకు ముందుగా దేశీయంగా ప్రజారవాణా వ్యవస్థ పుంజుకోవాలని ఫెయిత్ ఫ్రతినిధి తెలిపారు.
గడిచిన కొద్దిరోజులుగా కొన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఉధృతి పెరుగుతుండగా చాలా రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతోంది. మొత్తంగా మాత్రం కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో దుకాణాలను తెరుచుకునేందుకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే హోటళ్లు, బార్లు, క్లబ్బులు, దేశీయ విమాన సర్వీసులు మొదలైతే గాని గుడ్డిలో మెల్ల అన్న చందంగా పర్యాటక రంగం కొద్దిలో కొద్దిగా తేరుకోవడానికి అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకు కూడా దూర ప్రయాణాలు, జన సంచారంపై ఆంక్షలు విధించబడుతూనే ఉంటాయని చెబుతున్నారు. పర్యాటక రంగం కుదుటపడాలంటే ఏడాది పాటు ఆగాల్సిందేనంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple