నేడు దేశీయ స్టార్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. బెంచ్ మార్క్ సూచీలు అన్ని కూడా ఈ రోజు నష్టపోయాయి. నేడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయాలు ఇన్వెస్టర్లకు నచ్చలేదు. దీనితో దేశం మార్కెట్లు నష్టాల్లో బాట పట్టాయి. తాజాగా ఆర్బిఐ ఈఎంఐ మారిటోరియం మరో మూడు నెలలు పొగిడి పొడిగించడంతో, అలాగే కీలక రిపోర్ట్ ను కూడా తగ్గించడం వంటి విషయాలు ఇందుకు దోహదం చేశాయి. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలతో నేటి ఇంట్రాడేలో సెన్సెస్ 450 పాయింట్లు నష్టపోగా, నిఫ్ట్ కూడా 9000 దిగువకు చేరుకుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు దీనికి ప్రధాన కారణం. చివరికి BSE సెన్సెక్స్ 260 పాయింట్ల నష్టంతో 30,673 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 67 పాయింట్లు నష్టపోయి 9039 పాయింట్ల వద్ద ముగిసింది.
ఇక ఈరోజు మార్కెట్ విశేషాలు చూస్తే... నిఫ్టీ 50 లో ఎమ్ అండ్ ఎమ్, శ్రీ సిమెంట్, ఇన్ఫోసిస్, సిప్లా, జి ఎంటర్టైన్మెంట్ షేర్లు లాభాల బాట పడ్డాయి. ఇందులో జి ఎంటర్టైన్మెంట్ షేర్ 7 శాతం పైగా లాభపడింది. ఇక మరోవైపు యాక్సిస్ బ్యాంక్, hdfc బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు డీలా పడ్డాయి. ఇందులో యాక్సిస్ బ్యాంక్ ఏకంగా 5 శాతం పైగా నష్టపోయింది.ఇక నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్ లు అన్ని కాస్త మిశ్రమంగా ముగిసాయి. ముఖ్యంగా నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మీడియా ఇండెక్స్ లు అన్ని లాభాల బాట పడ్డాయి. మిగతా ఇండెక్స్ లు అని కూడా నష్టపోయాయి.
ఇక అలాగే అమెరికా డాలర్ తో మన భారతదేశ రూపాయి పోలిస్తే కాస్త నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి 33 పైసల నష్టంతో 75.90 వద్ద ట్రేడ్ కొనసాగుతోంది. అలాగే అంతర్జాతీయ ముడిచమురు ధరల విషయానికి వస్తే... బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 5.41 శాతం నష్టపోయి 34.1 డాలర్లకు చేరుకుంది. ఇక అలాగే WTA క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 6.87 శాతం నష్టంతో 31.6 డాలర్లకు చేరింది.