కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, సీఎన్జీ లను హోమ్ డెలివరీ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం కరోనా వైరస్ ని అరికట్టేందుకు లాక్ డౌన్ విధానం అమలు ఉండడంతో  పెట్రోల్, సిఎన్జి లను ఇంటి వద్దకు తీసుకువెళ్లి అందించే లాగా ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలియజేయడం జరిగింది. మంత్రి ఇప్పటికే డీజల్ హోమ్ డెలివెరీ చేస్తున్నాము... అలాగే పెట్రోల్ కూడా ఇదే విధంగా అందించేందుకు ఆయిల్ కంపెనీలు ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలియ చేశారు.


అంతేకాకుండా ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రధాన నగరాలలో డీజల్ 2018 నుంచే హోమ్ డెలివరీ చేస్తున్నామని మంత్రి తెలియజేయడం జరిగింది. లాక్ డౌన్ వల్ల ఇంధన డిమాండ్ వినియోగం చాలా వరకు తగ్గింది అంటూ మంత్రి పేర్కొన్నారు. అలాగే రతన్ టాటా ఆధ్వర్యంలో ఇండియన్ స్టార్ట్ అప్ కంపెనీ రిపోర్ట్స్ ఎనర్జీ కంపెనీ మొబైల్ పెట్రోల్ పంపుల ద్వారా ఇంటి వద్దకు వెళ్లి పెట్రోల్ డెలివరీ చేస్తాయి అని మంత్రి వివరించడం జరిగింది.

 

 

ఇక ఇంధనం కొనుగోలు విషయంలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది. లాక్ డౌన్ విధించడంతో ఇంధనాన్ని కొనుగోలుకు డిమాండ్ భారీగా పడిపోయిందని చెప్పాలి. ఇక భారతదేశంలో ఏప్రిల్ లో ఇంధన వినియోగం దాదాపు 70 శాతం తగ్గింది. ప్రస్తుత సమయంలో పెట్రోల్ వినియోగం 47 శాతం కన్నా తక్కువగా ఉంది. అంతేకాకుండా డీజిల్ వినియోగం 35% తక్కువగా ఉంది అంటూ తెలియజేశారు . అలాగే cng, ఎల్‌ఎన్‌జి, పిఎన్‌జిలతో సహా అన్ని రకముల ఇంధనాలు ఒకేచోట అందించడానికి త్వరలోనే ఇంధన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఇప్పటికే 56 cng స్టేషన్లను ప్రారంభించినట్లు తెలియజేశారు. వీటిలో నూతనంగా ప్రారంభించిన 8 స్టేషన్లు కూడా ఉన్నాయి . తెలంగాణ రాష్ట్రంతో సహా 11 రాష్ట్రాలలో ఈ ప్రభుత్వ ప్రైవేట్ ఆధ్వర్యంలో ఉన్నట్లు మంత్రి శాఖ తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: