లాక్ డౌన్ వేళా రుణమా? అది కూడా క్షణాల్లోనే రుణమా? ఏలా ? అసలు ఏ బ్యాంక్ ఇచ్చింది ఇంత అద్భుతమైన ఆఫర్ అన్ని అనుకుంటున్నారా? ఇంకే బ్యాంక్ అండి బాబు. ప్రైవేట్ రంగానికి చెందిన యస్ బ్యాంక్. తన కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ఈ ఆఫర్ ను ప్రకటించింది.
ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ ఆఫర్ అందరికీ వర్తించదు.. కేవలం బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ కలిగిన కస్టమర్లకు మాత్రమే ఈ ఫెసిలిటీ వర్తిస్తుంది. బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన వారికీ మాత్రమే ఈ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అందుబాటులో ఉంది అని యస్ బ్యాంక్ అవకాశం ఇచ్చింది.
అయితే సాధారణ కస్టమర్లకు 2 శాతం వడ్డీ రేట్లు, సీనియర్ సిటిజన్స్ కు 1 శాతం వడ్డీకే ఓవర్ డ్రాఫ్ట్ కింద లోన్ ఇస్తున్నట్టు తెలిపింది. అయితే ఈ ఓవర్ డ్రాఫ్ట్ కు బ్యాంకులో కనీసం రూ.50,000 ఎఫ్‌డీ చేసి ఉండాలి అని, అలాగే ఎఫ్‌డీ టెన్యూర్ కనీసం 181 రోజులు కంటే ఎక్కువ ఉంటే సరిపోతుంది అని తెలిపారు. కాగా ఎఫ్‌డీలపై ఓవర్ డ్రాఫ్ట్ అవకాశం బ్యాంక్ కు వెళ్లకుండానే పొందొచ్చు అని యస్ బ్యాంక్ తెలిపింది.
అయితే యస్ బ్యాంక్ మొబైల్, యస్ రోబో ద్వారా ఈ సర్వీసులు పొందే అవకాశం ఉన్నట్టు చెప్పారు. కస్టమర్లు ప్రిఅప్రూవ్డ్ ఆఫర్స్ లేదా ఎక్స్‌క్లూజివ్ ఆఫర్స్‌పై క్లిక్ చేసి, ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను సెలెక్ట్ చేసి ఈ సేవలు పొందొచ్చని యస్ బ్యాంక్ పేర్కొంది. కాగా యస్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.