గత ఐదు రోజుల నుంచి దేశీయ మార్కెట్ పరుగులు పెడుతోంది. ఈరోజు కూడా బెంచ్ మార్క్ సూచీలు అన్ని కూడా లాభాల బాట పడ్డాయి. నేడు మరోసారి లాభాల బాట పట్టింది. దీనితో ఐదు రోజులు వరుసగా లాభాల్లోనే దేశీయ మార్కెట్ ముగిసింది. ఫైనాన్సియర్, బ్యాంకింగ్, హెవీ వెయిట్ షేర్ల కొనుగోలు జోరుతో మార్కెట్ పరుగులు తీసింది. ఇక నేడు ఇంట్రాడేలో సెన్సెక్స్ 563 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ కూడా 9996 పాయింట్లకు చేరుకుంది. ఇక చివరికి bseసెన్సెక్స్ 522 పాయింట్ల లాభంతో 33,826 పాయింట్ల వద్ద అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 153 పాయింట్లు లాభంతో 9979 వద్ద నేటి మార్కెట్ ముగిసింది.
ఇక నేటి మార్కెట్ యొక్క లాభనష్టాలు ఒకసారి చూస్తే... బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, జి ఎంటర్టైన్మెంట్, టాటా మోటార్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల బాట పడ్డాయి. ఇందులో బజాజ్ ఫిన్ సర్వ్ షేర్లు దాదాపు ఏకంగా పది శాతం ర్యాలీ కొనసాగింది. ఇక అలాగే బీపీసీల్, మారుతి సుజుకి, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, ఐ టి సి, కోల్ ఇండియా నష్టపోయాయి. ఇక ఇందులో కోల్ ఇండియా మాత్రం మూడు శాతానికి పైగా నష్టపోయింది. ఇక అమెరికా డాలర్ తో భారత రూపాయి విలువ 18 పైసలు లాభంతో 75. 36 రూపాయల వద్ద ట్రేడవుతోంది.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల విషయానికి వస్తే కాస్త లాభాల్లో ముగిశాయి. అందులోని బ్రెంట్ ముడిచమురు ధర బ్యారెల్ కు 2.43 శాతం పెరిగి 39.26 డాలర్లకు చేరుకుంది. ఇక WTA ధర బ్యారెల్ కు 2.34 శాతం పెరుగుదలతో 36.28 డాలర్లకు చేరుకుంది.