రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ డిజిటల్ యూనిట్ లోని 1.16 వాటాను అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ADIA) కి రూ. 5683.50 కోట్లకు అమ్ముకున్న తర్వాత కంపెనీ షేర్లు విలువ 3% ఊపందుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ లో 2.74 శాతం లాభపడి రూ. 1, 624 వద్ద రిలయన్స్ షేర్లు ట్రేడవుతున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ లో 2.32 శాతం లాభం తో రూ. 1618.40 వద్ద రిలయన్స్ షేర్లు కొనసాగుతున్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఉన్నత అధికారులు ఆదివారం రోజు మాట్లాడుతూ... (JiO) జియో ప్లాట్‌ఫామ్‌లలో 1.16 శాతం వాటాను రూ .5,683.50 కోట్లకు అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ADIA) కి అమ్ముకున్నాం. దీంతో ఆయిల్-టు-టెలికాం సమ్మేళనం వద్ద రుణాన్ని తీర్చేందుకు సేకరిస్తున్న నిధులు రూ .97,885.65 కోట్లకు చేరుకున్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ తెలిపింది.
'జియో ప్లాట్‌ఫామ్ ల ఈక్విటీ విలువ రూ .4.91 లక్షల కోట్లు, ఎంటర్ప్రైజ్ విలువ రూ. 5.16 లక్షల కోట్లు. ఈ పెట్టుబడుల విలువల ప్రకారం అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ADIA) సంస్థ జియో ప్లాట్‌ఫామ్ లలో 1.16 శాతం వాటా దక్కించుకునేందుకు రూ. 5683.50 కోట్లు పెట్టుబడి పెట్టింది', అని రిలయన్స్ కంపెనీ ఒక ప్రకటన ద్వారా తెలిపింది.
ఈ అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ADIA) సంస్థ పెట్టుబడితో, ముఖేష్ అంబానీ జియో ప్లాట్‌ఫాం లు... ఫేస్‌బుక్, సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్, జనరల్ అట్లాంటిక్, కెకెఆర్, ముబడాలా, ఎడిఐఐలతో సహా ప్రముఖ ప్రపంచ పెట్టుబడిదారుల నుండి రూ .97,885.65 కోట్లు సేకరించాయి.