అత్యవసర పనుల నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారికి ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్ అందించింది. ప్రస్తుతం నడుపుతున్న 230 స్పెషల్ ట్రైన్స్‌లో 3 రైళ్లు మినహాయించి మిగిలిన వాటిల్లో చాలా వ‌ర‌కు బెర్తులు ఖాళీగా ఉన్న‌ట్లు అధికారులుత తెలిపారు. జూన్, జూలై నెలలకు గానూ అందుబాటులో ఉన్నాయని రైల్వేశాఖ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. జూలై చివరి వారం వరకు ఈ రైళ్లలో బెర్తులు ఖాళీ ఉంటాయని పేర్కొంది. టికెట్ బుక్ చేసుకునేవారికి ఖచ్చితంగా కన్ఫామేషన్ అవుతుందని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. ఇదిలా ఉండ‌గా కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ వేళ వలస కార్మికులు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. 

 

లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన సుమారు 62 లక్షల మందిని ప్రత్యేక రైళ్ల ద్వారా స్వస్ధలాలకు పంపించిన‌ట్లు రైల్వేశాఖ  తెలిపింది.  అవసరాన్ని బట్టి పలు రూట్లలో రైళ్ల సంఖ్యను కూడా పెంచే అవకాశం ఉందని ఆయన అన్నారు. కాగా, కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రైల్వేస్టేషన్లలో తగిన చర్యలు తీసుకుంటున్నామని.. ప్రయాణీకులు అందరూ కూడా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరని వీకే యాదవ్ వ్యక్తం చేశారు. వలస కార్మికులపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారం రోజుల క్రితం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటికి దూరంగా ఇన్ని రోజులుగా పనిలేకుండా ఉన్న మిగిలిన వారిని కూడా వారి సొంత రాష్ట్రాలకు 15 రోజుల్లోగా పంపాలని ఆదేశాలు జారీచేసింది. 

 

వలస కార్మికుల అంశంపై విచారణ జరిపి 24 గంటల్లోగా రైళ్లు ఏర్పాటు చేయాలని సూచించింది.కోర్టు ఆదేశాలు పాటించాలని.. రిజిస్ట్రేషన్ ప్రకారం, వలస కార్మికులను గుర్తించాలని స్పష్టంచేసింది. స్కీం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు.. వలస కార్మికులకు సాయం చేయాలని చెప్పింది. వలస కార్మికులను తిరిగి పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కౌన్సిలింగ్ ఇవ్వాలంది.ఈ నేప‌థ్యంలో రైళ్ల ద్వారా స్వ‌గ్రామాల‌కు చేరుకుంటున్న వారి  సంఖ్య ఇంకా కొన‌సాగుతూనే ఉంది. అయితే అదే స‌మ‌యంలో సొంత ఊర్లలో స‌రైన ఉపాధి అవ‌కాశాలు లేక పిల్లా జెల్లాతో స‌హా మ‌ళ్లీ ద‌క్షిణాధిలోని అనేక ప‌రిశ్ర‌మ‌ల‌కు చేరుకుంటున్నారు. గ‌తంలో క‌న్నా కాస్తా కూలీ రేట్లు పెంచ‌డం కూడా గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: