గత పదిహేను రోజులు పెట్రోల్ డీజిల్ ధరలు దారుణంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పట్లో ఈ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే స్థితిలో కనిపించడం లేదు. ఏది ఏమైనా పెట్రోల్, డీజిల్ ధరలు ఇంతలా కంటిన్యూగా పెరగటం ఇదే మొదటి సారి. ఇలాగె పెరగడం కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలు 100 రూపాయిలు దాటుతుంది. 

 

IHG

 

ఇంకా ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ మార్కెట్‌లోను ముడి చమురు ధరలు తగ్గాయిని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. కాగా ఈరోజు సోమవారం లీటరు పెట్రోల్ ధర 39 పైసలు పెరుగుదలతో రూ.82.25 పైసలకు, డీజిల్ ధర 46 పైసలు పెరుగుదలతో రూ.76.49పైసాలకు చేరింది. 

 

IHG

 

ఇంకా అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే కొనసాగుతుంది. పెట్రోల్‌ ధర 53 పైసలు పెరుగుదలతో రూ.81.79కు, డీజిల్‌ ధర కూడా 64 పైసలు పెరుగుదలతో రూ.75.88కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధర 65 పైసలు పెరుగుదలతో రూ.78.41కు, డీజిల్ ధర కూడా 64 పైసలు పెరుగుదలతో రూ.76.43కు చేరింది.

 

IHG

 

 ఇలా గత పదిహేను రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయ్. అయితే ప్రతి ఒక్కరు ఆనందించాల్సిన విషయం ఏంటి అంటే కరోనా నియంత్రణకై మొదలైన లాక్ డౌన్ లో పెట్రోల్ డీజిల్ ధరలు ఒక్క రూపాయి కూడా పెరగలేదు.. అప్పుడు స్థిరంగా కొనసాగాయి..ఇప్పుడు దారుణంగా పెరుగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: