అంతర్జాతీయంగా రెండో దశ కొవిడ్-19 భయాల మధ్య ఇన్వెస్టర్ల ఆందోళనతో యూరోపియన్ మార్కెట్లలో అమ్మకాలు పెరిగాయి. యూకె, జర్మనీ, ఫ్రాన్స్, మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. దేశీయంగా ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకే ప్రాధాన్యం ఇవ్వడంతో ఈక్విటీ మార్కెట్లు ఆరంభం లాభాలతో మొదలైనా చివరికి నష్టాల్లోకి చేరాయి. సెన్సెక్స్ 561 పాయింట్లు నష్టపోయి 34,868 వద్ద, నిఫ్టీ 165 పాయింట్లు నష్టపోయి 10,305 పాయింట్లకు చేరింది. ఉదయం లాభాలతో మొదలైన మార్కెట్లు మధ్యాహ్నం వరకు లాభాల్లో కొనసాగి.. ఆ తర్వాత నష్టాల్లోకి జారుకొన్నాయి. ముఖ్యంగా ఎఫ్‌అండ్‌వోలు సెటిల్మెంట్లు ఉండటంతో ఇన్వెస్టర్లు విక్రయాలు జరిపారు.
ఆసియా మార్కెట్లలో బలహీనతల కారణంగా దేశీయ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. పైగా, గురువారంతో జూన్ డెరివేటివ్ సిరీస్ ముగియనుండం వల్ల ట్రేడర్లు లాభాల స్వీకరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం కూడా మార్కెట్ల నష్టాలకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫార్మా, ఫైనాన్షియల్ రంగాల్లో నష్టాలు నమోదు కావడంతో నిఫ్టీ బ్యాంకు భారీగా పడిపోయింది. మధ్యాహ్నం తర్వాత అనుకోకుండా అమ్మకాలు పెరగడంతో మార్కెట్లు లాభాల నుంచి కుదేలయ్యాయి. మంగళూరు రిఫైనరీ, హ్యూస్టన్ ఆగ్రో, పేజ్ ఇండస్ట్రీస్, సెంట్రమ్ క్యాపిటల్, జమ్ము అండ్ కశ్మీర్ బ్యాంక్ లాభపడగా.. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, యూనియన్ బ్యాంక్, ఇన్ఫోఎడ్జ్, టీవీ18 బ్రాడ్‌కాస్ట్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ నష్టపోయాయి.
దీంతో, మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 561.45 పాయింట్లను కోల్పోయి 34,868 వద్ద ముగియగా, నిఫ్టీ 165.70 పాయింట్లను నష్టపోయి 10,305 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఏషియన్ పెయింట్, ఐటీసీ, నెస్లె ఇండియా, టెక్ మహీంద్రా, రిలయన్స్ టీసీఎస్ షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడవ్వగా, మిగిలిన అన్ని సూచీలు నష్టాలను నమోదు చేశాయి.ఐసీఐసీఐ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్ , హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ భారీగా నష్టపోతున్నాయి. సిప్లా, గ్లెన్ మార్క్, అల్కెం, అరబిందో, డా. రెడ్డీస్, సన్ ఫార్మ, టొరంటో ఫార్మ, దివీస్ తదితర ఫార్మ రంగ షేర్లన్నీ కుప్పకూలాయి. దీంతో నిఫ్టీ పార్మ దాదాపు 2 శాతం నష్టపోయింది. అటు ఆసియన్ పెయింట్స్, ఐటీసీ, హెచ్‌డిఎఫ్‌సీ, టీసీఎస్ లాభపడుతున్నాయి.