దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల‌తో ట్రేడింగ్‌ను ముగించాయి. ఉదయం నుంచే అమ్మకాల ఒత్తిడికి గురవడం..అదే ట్రెండ్ సాయంత్రం వ‌ర‌కు కొన‌సాగింది.అయితే గ‌త రోజుతో పోల్చుకుంటే మాత్రం భారీ న‌ష్టాల క్ర‌మంలోనుంచి మాత్రం బ‌య‌ట ప‌డిన‌ట్లేన‌ని చెప్పాలి.  జూన్ సిరీస్‌ ముగియనున్న నేపథ్యంలో  లాభ నష్టాల మధ్య  తీవ్రంగా ఊగిసలాడిన కీలక సూచీలు చివరి గంటలో పుంజుకుని స్వల్ప నష్టాలతో సరిపెట్టుకున్నాయి. పైగా, ప్రపంచ ఆర్థికవ్యవస్థ ప్రస్తుతం సంవత్సరంలో మైనస్ 5 శాతం క్షీణత నమోదు చేస్తుందని ఐఎంఎఫ్ తాజా అంచనాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని నిపుణులు భావిస్తున్నారు. 


అంతేకాకుండా, జూన్ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనుండటంతో మార్కెట్లు ఒడిదుడుకులకు లోనైనట్టు చెప్పారు. ఒక దశలో 350 పాయింట్లకుపైగా కుప్పకూలిన  సెన్సెక్స్ 27 పాయింట్ల స్పల్ప నష్టంతో 34842 వద్ద, నిఫ్టీ 16 పాయింట్లు నష్టంతో 10288 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఐటీ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ,  ఫార్మా లాభపడ్డాయి. దీంతో సెన్సెక్స్ 26.88 పాయింట్లను కోల్పోయి 34,842 వద్ద ముగియగా, నిఫ్టీ 16.40 పాయింట్లు నష్టపోయి 10,288 వద్ద ముగిసింది. 
ఏషియన్ పెయింట్స్, హిందాల్కో, ఇండియన్ ఆయిల్, ఐషర్ మోటార్స్, ఇన్ఫోసిస్, శ్రీ సిమెంట్స్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, ఎన్‌టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, కోల్ ఇండియా హెచ్ సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్ర నష్టపోగా,  ఎఫ్‌ఎంసిజి ఇండెక్స్ 2 శాతం పెరిగి టాప్ గెయినర్ గా వుంది.

 

 సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఐటీసీ, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హిందూస్తాన్ యూనిలీవర్ సూచీలు అధిక లాభాలను నమోదు చేయగా, ఏషియన్ పెయింట్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, ఓఎన్‌జీసీ, ఎంఅండ్ఎం, టీసీఎస్ షేర్లు నష్టాల్లో కదలాడాయి.అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ గురువారం నష్టంతో మొదలైంది. సెన్సెక్స్‌ 334 పాయింట్లు నష్టపోయి 34534వద్ద, నిప్టీ 102 పాయింట్లను కోల్పోయి 10202 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: