వారంతంలో నష్టాలను నమోదు చేసిన మార్కెట్లు మళ్లీ లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఉదయం నుంచే లాభాల్లో ట్రేడయిన సూచీలు మార్కెట్లు ముగిసే సమయానికి స్వల్ప లాభాలతో ముగిశాయి. మొత్తంగా వారంతాపు న‌ష్టాల భ‌యాల నుంచి మ‌దుప‌ర్లు బ‌య‌ట‌ప‌డి కొనుగోళ్లు ముందుకు వ‌చ్చిన‌ట్లు విశ్లేష‌కులు చెబుతున్నారు. మ‌రోవైపు ఈ వారంలో కంపెనీలు త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్న నేపథ్యంలో మదుపర్లు వాటిపై దృష్టి సారించినట్టు అభిప్రాయ‌ప‌డ్డారు. బ్యాంకింగ్‌ రంగ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మిడ్‌సెషన్‌ కల్లా 1.50శాతం నష్టాన్ని చవిచూసింది. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫైనాన్స్‌ సర్వీస్‌, నిఫ్టీ ప్రభుత్వరంగ, ప్రైవేట్‌ రంగ ఇండెక్స్‌లు 1.50శాతానికి పైగా క్షీణించాయి. 

 

బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగాలకు చెందిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లలో అమ్మకాలు వెల్లుత్తాయి. ఫలితంగా సూచీలు సోమవారం ఉదయం ఆర్జించిన భారీ లాభాల్ని మిడ్‌సెషన్‌ కల్లా కోల్పోయి స్వల్పనష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలకు చెందిన బ్యాంకింగ్‌ రంగ షేర్లతో పాటు ఫైనాన్స్‌ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మిడ్ సెషన్‌కు ముందు మదుపర్లు కొనుగోళ్లకు సిద్ధపడటంతో 400 పైగా లాభపడిన మార్కెట్లు తర్వాత వెనకడుగు వేశాయి. మిడ్ సెషం తర్వాత మళ్లీ అమ్మకాలు పెరగడంతో నష్టాలు, లాభాల మధ్య ఊగిసలాడి చివరి గంటలో లాభాలను నమోదు చేసింది. 

 


దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 96.36 పాయింట్లు లాభపడి 36,693 వద్ద ముగియగా, నిఫ్టీ 47.15 పాయింట్ల లాభంతో 10,815 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్, రిలయన్స్, భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనిలీవర్, ఐటీసీ, సన్‌ఫార్మా, టాటాస్టీల్ షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, బజాజ్ ఫినాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, పవర్‌గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, కోటక్ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. నిఫ్టీలో ముఖ్యంగా ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ, మెటల్ రంగాలు లాభపడగా, రియల్టీ, బ్యాంకింగ్ రంగాలు నష్టపోయాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: