ప్రపంచ వ్యాప్తంగా
ఆపిల్ సంస్థకు సంబంధించిన ఉత్పత్తుల గురించి వాటి అమ్మకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆపిల్ సంస్థ కు సంబంధించి ఏదైనా ఉత్పత్తి రిలీజవుతుందంటే వాటిని కొనడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆత్రంగా ఎదురు చూసే వారు ఎందరో. ఇక
ఆపిల్ సంస్థకు చెందిన మొబైల్ ఫోన్లు రిలీజ్ అవుతాయి అని తెలిసిన వారు రిలీజ్ తేదీన షో రూమ్ బయట కిలోమీటర్ల మేర మొబైల్ కొనడానికి క్యూలు కడతారు. మరి కొందరు ఈ ఫోన్లను కొనడానికి వారి శరీర భాగాలను అమ్ముకున్న రోజులు కూడా ఉన్నాయంటే నమ్మండి.

ఇకపోతే తాజాగా
ఆపిల్ సంస్థ ఓ ఘనతను సాధించింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా
ఆపిల్ సంస్థ అవతరించింది. కరోనా సమయంలో కూడా
ఆపిల్ సంస్థ రెండో క్వార్టర్ లో ఫలితాలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో
ఆపిల్ సంస్థ షేర్ వాల్యూ ఏకంగా పది శాతం పైగా లాభపడింది. దీంతో 425 డాలర్లకు పైగా
ఆపిల్ సంస్థ షేర్లు చేరుకున్నాయి. దీంతో ప్రపంచంలో ఇదివరకు అత్యధిక క్యాపిటలైజేషన్ ఉన్న సౌదీ దేశానికి చెందిన ఆరామ్ కో కంపెనీని అధిగమించినట్లైంది.

ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అందరూ ఇంటి దగ్గర నుండి పని చేస్తున్న సంగతి విదితమే. దీంతో
ఆపిల్ సంస్థ కు సంబంధించి కొన్ని ఉత్పత్తుల డిమాండ్ భారీగా పెరిగింది. ఈ ఒక్క సంవత్సరమే
ఆపిల్ సంస్థ షేర్ ఏకంగా 45 శాతం పైన ర్యాలీ చేసింది. ఇక
ఆపిల్ సంస్థల విలువ శుక్రవారం నాటికి
మార్కెట్ విలువ 4.3 బిలియన్ల అవుట్ స్టాండింగ్ షేర్లు ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. దీంతో
ప్రపంచంలోనే అత్యంత విలువైన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఆపిల్ సంస్థ అవతరించింది.