ఇందులో కరోనా వైరస్ సంబంధించి యాంటీ డ్రగ్ ను కూడా కనిపెట్టడానికి అరబిందో ఫార్మా అహర్నిశలు కృషి చేస్తోంది. అయితే ఇందుకు సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఫండింగ్ కు అరబిందో వ్యాక్సిన్ ఎంపికయినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి గత ఏడాదిలో అరవింద్ ఒక అనుబంధంగా పనిచేస్తున్న ఆరో వ్యాక్సిన్ ద్వారా బయో సైన్సెస్ ఆస్తులను కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఇలా కొనడం ద్వారా వ్యాక్సిన్ విభాగంలో అరబిందో బలం మరింత పెరిగిందని వివరించింది.
ఇక తాజాగా అరబిందో కంపెనీ నిమోనియా బారినపడిన వారికి ఇవ్వబోయే వ్యాక్సిన్ న్యూస్ సైతం బాగా అభివృద్ధి చేసింది. ఇందుకు సంబంధించి వారి ఉత్పాదన విలువ చూస్తే ప్రపంచ వ్యాప్తంగా 6.2 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఫేస్ 1, ఫేస్ 2 సంబంధించి స్టడీ జరిగిపోయిందని, ఫేస్ 3 క్లినికల్ స్టడీ ఈ ఏడాది డిసెంబర్ నెలలో మొదలు కాబోతున్నట్లు అరబిందో అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది ఈ వ్యాక్సిన్ విడుదల చేసే అవకాశం ఉందని అరబిందో అధికారులు తెలియజేశారు. ఒరాల్స్ తయారీ కోసం ఇక రకాల ఉత్పత్తుల కోసం అమెరికా లతో పాటు భారత్ లో కూడా కొత్తగా ప్లాంటును స్థాపించబడింది. ఇందుకు సంబంధించి అనేక ఏర్పాట్లు కార్యకలాపాలకు సంబంధించిన విషయాలను సిద్ధం చేసింది అరబిందో.