నేడు ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్ రంగాలలో భారీ లాభాలు గడించారు. ఒక్క నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఐటీ షేర్లు నష్టాల్లో ముగిసిన మిగత నిఫ్టీ ఇండెక్స్ లు అన్ని లాభాల్లో ముగిశాయి. ఇక నేడు నిఫ్టీ 50 లో లాభనష్టాల విషయానికి వస్తే... జి ఎంటర్టైన్మెంట్, యాక్సిస్ బ్యాంక్, జెఎస్డబ్ల్యు స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బీపీసీఎల్ కంపెనీల షేర్లు అత్యధిక లాభాల్లో ముగిశాయి. ఇక ఆ తర్వాత శ్రీ సిమెంట్స్, టైటాన్, యుపిఎల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా ల కంపెనీలో నష్టాల బాట పట్టాయి.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ డాలర్ తో పోల్చి చూస్తే నేడు 12 పైసలు లాభపడి 74.77 వద్ద ముగిసింది. ఇక నేడు బంగారం మార్కెట్ ధరల విషయానికొస్తే.. 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాదులో 10 గ్రాములు రూ. 440 రూపాయలు తగ్గి రూ. 58, 030 వద్ద ముగిసింది. ఇక అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 440 రూపాయలు తగ్గి రూ. 53,140 వద్ద ముగిసింది. అలాగే కేజీ బంగారం ధర ఏకంగా రూ. 2650 రూపాయలు తగ్గి రూ. 72 ,500 వద్ద ముగిసింది.