ఇక నేడు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఆటో మెటల్, మీడియా, రియాల్టీ రంగాలు లాభపడగా మిగతా నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్ లు నష్టపోయాయి. ఇక నేడు నిఫ్టీ 50 లో లాభనష్టాల విషయానికి వస్తే... ఎల్ అండ్ టి, టాటా మోటార్స్, టైటాన్, ఎయిర్టెల్ ఇన్ఫ్రాటెల్, హిందాల్కో, లార్సెన్ కంపెనీలు అత్యధికంగా లాభపడిన లిస్టులో ముందుగా ఉన్నాయి. వీటిలో టాటా మోటార్స్ అత్యధికంగా 4.6 శాతం లాభపడింది. ఇక మరోవైపు భారతి ఎయిర్ టెల్, సన్ ఫార్మా, ఐచర్ మోటార్స్, ఎన్టీపీసీ, హెచ్డిఎఫ్సి లైఫ్ కంపెనీల షేర్లు అత్యధికంగా నష్టపోయిన జాబితాలో ముందుగా ఉన్నాయి. ఇందులో భారతి ఎయిర్ టెల్ అత్యధికంగా 2.2 శాతం పైగా నష్టపోయింది.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో భారత రూపాయి మారక విలువ డాలర్ విలువతో పోల్చి చూస్తే ఫ్లాట్ గానే ముగిసింది. ప్రస్తుతం 74.91 వద్ద ముగిసింది. ఇక బంగారం ఫీచర్స్ లోకి వస్తే నేడు మల్టీ కముడిటీ ఎక్స్చేంజ్ లో బంగారం ఫీచర్స్ లో 286 రూపాయలు పెరిగి రూ. 52,540 వద్ద ముగిసింది. అలాగే కేజీ బంగారం ద్వారా ఫీచర్స్ లో ఏకంగా 2253 రూపాయలు పెరిగి 69,060 రూపాయలకు చేరుకుంది.