ప్రస్తుత సమాజంలో ఆధార్ కార్డు గురించి తెలియని వారంటూ ఎవరు లేరు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ప్రస్తుతం ఉన్న కీలకమైన డాక్యుమెంట్లలో ఆధార్ కూడా ఒకటి. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఆధార్ కార్డు ఉండాల్సిందే.  అలాగే ఆదాయపు పన్ను చెల్లించే వారికి కూడా ఆధార్ కార్డు అవసరం ఉంటుంది. ఇప్పుడు కొత్తగా పాన్ కార్డు తీసుకోవాలంటే కచ్చితంగా ఆధార్ ఇవ్వాల్సిందే.


ఇలా ఆధార్ కార్డుతో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఆధార్ కార్డుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి అంటున్నారు నిపుణులు. ఆధార్ కార్డులో కొన్ని సందర్భాల్లో తప్పులు ఉండే అవకాశముందన్నారు. ఇలా తప్పులు ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు కూడా పడొచ్చునని తెలిపారు. అందువల్ల కార్డులో తప్పులు లేకుండా చూసుకోవాలి. ఆధార్ కార్డులో తప్పులు ఉంటే వాటిని సరిచేసుకోవచ్చు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఈ పని చేయొచ్చు. అయితే ఆధార్‌ కార్డులో వివరాలను మార్చుకోవాలంటే కచ్చితంగా కొంత ఫీజు చెల్లించాలి. ఆఫ్‌లైన్‌లో అంటే ఆధార్ సెంటర్‌కు వెళ్లి వివరాలను మార్చుకుంటే చార్జీలు పడతాయి. ఇప్పుడు తాజాగా ఆధార్ అప్‌డేట్ చార్జీలు పెరిగాయని తెలిపారు.



యూఐడీఏఐ తాజాగా ఆధార్ అప్‌డేట్ వివరాలను మార్చుకునేందుకు చెల్లించే చార్జీలను రూ.50 పెంచిందని తెలిపారు. ఇక బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్‌కు ఇది వర్తిస్తుందని తెలిపారు. అంటే ఇకపై ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవాలంటే రూ.100 చెల్లించాలని తెలిపారు. యూఐడీఏఐ ఈ విషయాన్ని సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేస్తుందని అన్నారు. ఆధార్‌లో ఒకటి కన్నా ఎక్కువ వివరాలను సరిచేసుకోవాలంటే రూ.100 చెల్లించాల్సిందే మరి. ఇకపోతే పేరు, మొబైల్ నెంబర్, వయసు వంటి వివరాల మార్పునకు రూ.50 చెల్లించాలని నిపుణులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: