మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేశారా? అయితే  మీరు ఇది తప్పక తెలుసుకోవాల్సిందే. ఓటీపీ చెప్తేనే సిలిండర్ డెలివరీ అవుతుందని నిపుణులు వెల్లడించారు. ఇక ఓటీపీ తప్పనిసరి చేస్తోంది కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక కస్టమర్లకు వేగంగా, హైటెక్ సేవలు అందించడంతో పాటు గ్యాస్ డెలివరీ విధానంలో ఉన్న అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ విధానం తీసుకొస్తోంది కేంద్ర ప్రభుత్వం.

ఇప్పటికే న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈ కొత్త విధానం అమలులోకి వచ్చింది. త్వరలో దేశమంతా ఇదే పద్ధతి అమలు చేయనుంది. కస్టమర్లు గ్యాస్ డెలివరీ బాయ్స్‌కి ఏజెన్సీ నుంచి వచ్చిన ఓటీపీ చూపిస్తేనే ఎల్‌పీజీ సిలిండర్ డెలివరీ పూర్తవుతుందని తెలిపారు. పెట్రోలియం మంత్రిత్వ శాఖ సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దేశవ్యాప్తంగా ఎప్పట్లోగా ఇది అమలు చేస్తారో తెలియాల్సి ఉందని నిపుణులు తెలిపారు.

అయితే కొత్త రూల్ ప్రకారం కస్టమర్లు ఎల్‌పీజీ సిలిండర్ బుక్ చేసిన తర్వాత ఏజెన్సీ ఆపరేటర్ రిసిప్ట్ ప్రింట్ చేయగానే కస్టమర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. డెలివరీ బాయ్ మీ ఇంటికి వచ్చిన తర్వాత అతనికి ఓటీపీ చెప్పాలి. డెలివరీ బాయ్ తన ఫోన్‌లో ఉన్న కంపెనీ యాప్‌లో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతే సిలిండర్ డెలివరీ చేస్తారు.

అంతేకాకుండా ఎల్‌పీజీ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట పడుతుందని గ్యాస్ కంపెనీలు భావిస్తున్నాయని తెలిపారు. ఒకవేళ కస్టమర్లు తమ మొబైల్ నెంబర్లు రిజిస్టర్ చేయకపోతే వెంటనే రిజిస్టర్ చేయాలని చెప్పారు. ఇక నెంబర్ మారినట్టైతే అప్‌డేట్ చేయాలని పేర్కొన్నారు. ఒకవేళ ఓటీపీ రాకపోతే కస్టమర్లు ఆధార్ కార్డు చూపించి గ్యాస్ సిలిండర్ తీసుకోవచ్చునని నిపుణులు వెల్లడిచించారు.

ఇక ఓటీపీ విధానం ఇప్పటికే ఉజ్వల కస్టమర్లకు ఉందని తెలిపారు. త్వరలో మిగతా కస్టమర్లకూ అందుబాటులోకి వస్తుంది. ఇదొక్కటే కాదు గ్యాస్ బుకింగ్ నుంచి డెలివరీ వరకు ప్రతీ చోటా డిజిటలైజ్ చేయాలని పెట్రోలియం శాఖ ఆదేశాలు జారీ చేశారు. దీని ద్వారా బ్లాక్ మార్కెటింగ్‌కు బ్రేక్ వేయాలన్నది పెట్రోలియం శాఖ ఉద్దేశం అని నిపుణులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: