మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చాల పథకాలను అందుబాటులోకి వచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఎల్‌పీజీ సిలిండర్లపై సబ్సిడీ అందజేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.  అయితే ఇక ఏడాదిలో 12 సిలిండర్లకు సబ్సిడీ పొందొచ్చునని నిపుణులు తెలిపారు. అంతేకాక సిలిండర్ కొనేప్పుడు పూర్తి ధర చెల్లించాలని అన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం కస్టమర్ ఖాతాలో సబ్సిడీ డబ్బులను క్రెడిట్ అవుతాయని తెలిపారు. ఇక డైరెక్ట్ బెనిఫిటి ట్రాన్స్‌ఫర్ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం బదిలీ చేస్తుందని తెలిపారు. 2015 లో ఈ స్కీమ్ ప్రారంభమైంది. ఎల్‌పీజీ కస్టమర్ల బ్యాంకు అకౌంట్‌లోకి సబ్సిడీ డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్ చేసే స్కీమ్ ఇది.


అంతేకాక అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలను బట్టి ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు మారుతాయని తెలిపారు. ఇక ప్రతీ నెలా ఎల్‌పీజీ సిలిండర్ ధరల్ని సవరిస్తుంటాయని తెలిపారు. ఆయిల్ కంపెనీలు. అందుకే సిలిండర్ ధరల్లో హెచ్చుతగ్గులుంటాయని అన్నారు. ఇక సబ్సిడీ విషయానికి వస్తే కస్టమర్ సిలిండర్ తీసుకున్న కొద్దిరోజుల్లోనే సబ్సిడీ బ్యాంకు అకౌంట్‌లో జమ అవుతుంది. మీకు వరుసగా రెండు నెలలు సబ్సిడీ డబ్బులు రాకపోతే ఎల్‌పీజీ సబ్సిడీ స్టేటస్ తెలుసుకోవాలని అన్నారు.


ఐఓసీఎల్, హెచ్‌పీ, బీపీసీఎల్ కంపెనీల నుంచి మీరు సిలిండర్లు కొనుగోలు చేస్తున్నారు. ఇక ఎల్‌పీజీ సబ్సిడీ స్టేటస్ తెలుసుకోవడానికి వేర్వేరు వెబ్‌సైట్స్ చూడాల్సిన అవసరం లేదని తెలిపారు. http://mylpg.in/ వెబ్‌సైట్‌లో మీ సబ్సిడీ స్టేటస్ తెలుసుకోవచ్చునని తెలిపారు. ఐఓసీఎల్, హెచ్‌పీ, బీపీసీఎల్ కంపెనీలకు సంబంధించిన వివరాలన్నీ ఈ వెబ్‌సైట్‌లో ఉంటాయని తెలిపారు. మరి మీకు సబ్సిడీ రాకపోతే స్టేటస్ చెక్ చేసుకునేందుకు ఈ స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుందని తెలిపారు.


అయితే http://mylpg.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. హోమ్ పేజీలోనే మీ 17 అంకెల ఎల్‌పీజీ ఐడీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఎల్‌పీజీ ఐడీ తెలుస్తుందని తెలిపారు. ఆ తర్వాత మీ ఎల్‌పీజీ ఐడీని ఎంటర్ చేయండి. మీ ఇమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌తో రిజిస్టర్ చేసుకొండి. మీ ఇమెయిల్ ఐడీకి యాక్టివేషన్ లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ క్రియేట్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: