దేశంలో కరోనా వైరస్ శర వేగంగా వ్యాప్తిస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ రెపో రేటును 4 శాతానికి తగ్గించిందని నిపుణులు తెలిపారు. ఇక ఎస్బీఐ కూడా గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించిందని అన్నారు. sbi ప్రస్తుత గృహ రుణగ్రహీతలకు రెపో రేటుతో అనుసంధానించబడిన నూతన వడ్డీ రేటుకు మార్చుకోవడానికి మంచి అవకాశాన్ని ఇచ్చింది. కస్టమర్ వన్ టైమ్ స్విచ్ఓవర్ ఫీజుతో పాటు జీఎస్టీ చెల్లించాలన్నారు.

ప్రస్తుత ఎస్బీఐ గృహ రుణ వడ్డీ రేట్లు 7% నుండి 7.35% పరిధిలో ఉన్నాయని అన్నారు. ఈ వడ్డీ రేట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- rbi రెపో రేటుతో ముడిపడి ఉంటాయని తెలియజేశారు. ఇక మహిళా రుణగ్రహీతలకు వడ్డీ రేట్లపై ఎస్బీఐ 0.05% ప్రత్యేక తగ్గింపును అందిస్తుందని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆర్బీఐ రెపో రేటును 4 శాతానికి తగ్గించిందని తెలిపారు. దాని తరువాత గృహ రుణాలపై వడ్డీ రేట్లు బాగా పడిపోయినట్లు తెలిపారు. అంతేకాకుండా బ్యాంకులు అందించే గృహ రుణాలపై వడ్డీ రేట్లు ప్రస్తుతం ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్(ఈబీఆర్)తో అనుసంధానించబడ్డాయని తేలిపారు.

ఇక రుణగ్రహీతలకు గృహ రుణాలపై మూడు ప్రత్యేక ఆఫర్లను ఎస్బీఐ ప్రకటించింది. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా లోన్ తీసుకుంటే మరో 0.05 శాతం వడ్డీ రాయితీ ఉంటుందని అన్నారు. అంతేకాక కొత్తగా తీసుకునే రుణాలకు ప్రాసెసింగ్ ఫీజు ఉండదని అన్నారు. ఇక రుణాల కోసం ఎంసిఎల్ఆర్ రీసెట్ ఫ్రీక్వెన్సీని ఎస్బిఐ ఒక సంవత్సరం నుండి ఆరు నెలలకు తగ్గించిందన్నారు. ఉదాహరణకు, మీ గృహ రుణం రీసెట్ తేదీ ఆగస్టు ఫిబ్రవరిలో సవరించినట్లయితే, దాని ప్రభావం మీ EMI పై ఆగస్టులో మాత్రమే అనుభవించవచ్చు. ప్రస్తుతం, ఎస్బీఐ బ్యాంక్ యొక్క సంవత్సరం ఎంసిఎల్ఆర్ 7%, ఆరు నెలల ఎంసిఎల్ఆర్ 6.95% వద్ద ఉందని నిపుణులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: