ఐటి దిగ్గజ కంపెనీలలో ఒకటైన  యాక్సెంచర్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతుంది. ప్రపంచం మొత్తం కరోనా వైరస్ నేపథ్యంలో పెద్ద మల్టీ నేషనల్ కంపెనీల నుండి చిన్న కంపెనీల వరకు ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ దెబ్బతో అనేక రంగాలు చితికల పడ్డాయి. ఇందులో భాగంగానే ఐటి దిగ్గజ కంపెనీ యాక్సెంచర్ కంపెనీ తన ఉద్యోగుల పట్ల కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఎవరైతే  యాక్సెంచర్ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులు స్వచ్ఛందంగా ఉద్యోగాలు వదులుకుంటే వారికి కంపెనీ 7 నెలల వేతనాలను చెల్లిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే...

ప్రతి సంవత్సరం  యాక్సెంచర్ కంపెనీలో ఉద్యోగాల కల్పన, అలాగే ఉద్యోగాల కోత రెండు జరుగుతూనే ఉంటాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం కరోనా వైరస్ ఈ నేపథ్యంలో నైపుణ్యం లేని 5 శాతం ఉద్యోగాలకు కోత విధించనున్నట్లు ఇదివరకే  యాక్సెంచర్ కంపెనీ ప్రకటించింది. అంతేకాకుండా ప్రస్తుతం టెక్నాలజీ డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నామని, అలాగే డిమాండ్ లేని ప్రాంతంలో ఉద్యోగులను తీసేస్తున్నట్లు యాజమాన్యం తెలియజేసింది. అయితే ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎవరైతే  యాక్సెంచర్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు స్వచ్ఛందంగా పదవి నుండి తప్పుకుంటారో వారికి ఏడు నెలల వేతనం చెల్లించే విధంగా చర్యలు తీసుకొబోతుంది.

అయితే ఈ ఏడు నెలల్లో మొత్తం మూడు నెలల సమయాన్ని నోటీసు పీరియడ్ గా పరిగణిస్తూ... మరో నాలుగు నెలల వేతనాలను ఎక్స్ట్రాగా చెల్లించనుంది. ఇక ఇది వరకు మెజారిటీ కంపెనీలు వారి కంపెనీలో ఉద్యోగం నుండి తొలగించిన సమయంలో కేవలం రెండు లేదా మూడు నెలల వేతనాలు మాత్రమే వారికి చెల్లించాయి. మొత్తానికి కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచంలో అనేక మంది వారి ఉద్యోగాలను కోల్పోయినట్టు వారయ్యారు. ఇకపోతే  యాక్సెంచర్ కంపెనీకి 70 శాతం రెవెన్యూ కేవలం డిజిటల్ సేవలు నుండి మాత్రమే లభిస్తాయి. ఇలా ప్రతి కంపెనీ వారి ఉద్యోగులను తొలగించే విధంగా అనేక రకాల చర్యలను చేపడుతున్నాయి. అయితే కొన్ని కంపెనీలు కొత్త ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. అయితే, ఎక్కువ మందిని ఉద్యోగాలు నుంచి తప్పించే ప్రయత్నమే ఎక్కువగా చేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: