రెండు రోజుల వరుస భారీ లాభాలకు చెక్ పెడుతూ నేడు స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. నేడు రోజు మొత్తం ఓసారి లాభాల్లోకి వెళితే, మరోసారి నష్టాల్లోకి వచ్చిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి ఫ్లాట్ గా ముగిసింది. ఇక మార్కెట్ సమయం ముగిసే సమయానికి సెన్సెక్స్ 8 పాయింట్లు స్వల్పంగా నష్టపోయి 37973 పాయింట్స్ వద్ద ముగియగా, మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా కేవలం 5 పాయింట్లు నష్టపోయి 11222 వద్ద ముగిసింది. ఈరోజు మార్కెట్ లాభనష్టాల మధ్య దోబూచులాడటానికి గల కారణం చైనాతో సరిహద్దు వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకోసమే భారతీయ స్టాక్ మార్కెట్లు ఊగిసలాడుతున్నాయి.


ఇక నేటి నిఫ్టీ 50 లాభనష్టాల విషయానికి వస్తే... ముందుగా అత్యధికంగా లాభాలు స్వీకరించిన కంపెనీ షేర్ల విషయానికి వస్తే హిందాల్కో, అల్ట్రాటెక్ సిమెంట్, హీరో మోటార్, జెఎస్డబ్ల్యు స్టీల్, టి సిఎస్ కంపెనీలు అత్యధికంగా లాభపడ్డ లిస్టులో మొదటగా ఉన్నాయి. ఇక ఇందులో హిందాల్కో కంపెనీ షేర్లు అత్యధికంగా 5 శాతం పైగా లాభపడ్డాయి. ఇక మరోవైపు నష్టాల విషయానికొస్తే ఓఎన్జిసి, ఇందుస్ ఇండ్ బ్యాంక్, యుపిఎల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యాక్సిస్ బ్యాంక్ అత్యధికంగా నష్టపోయిన కంపెనీ షేర్లలో ముందుగా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఓఎన్జిసి 3.7 శాతం పైగా నష్టపోయింది.


ఇక నగదు విభాగం చూస్తే విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు కేవలం 27 కోట్ల విలువైన స్టాక్స్ మాత్రమే విక్రయించగా, దేశీయ ఫండ్స్ రూ. 542 కోట్లకు పైగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. ఇక నేటి బంగారం ధర విషయానికి వస్తే... హైదరాబాద్ మార్కెట్ పరంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ద్వారా 490 రూపాయలు పెరిగి 52530 కి చేరుకోగా, మరోవైపు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 460 రూపాయలు పెరిగి 48150 రూపాయలకు చేరుకుంది. ఇక బంగారం విషయానికి వస్తే.. ఒక కేజీ వెండి ధర ఏకంగా 2700 పెరిగి రూ. 60700 కు చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: