ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్బర్ అనే కార్యక్రమం కింద స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించే నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో విదేశాల నుంచి దిగుమతి చేసే టచ్ ప్యానెల్స్, డిస్ప్ ప్లే పై సుంకంను విధించింది. పది శాతం పెంచిన సుంకం అలాగే దానిపై విధించే చెస్ మొత్తం కలుపుకొని 11 శాతం మేర ధరలు పెరగనున్నాయి. దీంతో దేశంలో వివిధ దేశాలకు సంబంధించిన మొబైల్స్ ధరలు 2 నుండి 5 శాతం వరకు పెరిగే అవకాశం కనబడుతోంది. ఇది ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పండుగ సీజన్ ఉండడంతో వినియోగదారులకు అందించేందుకు మరింత స్టాక్ కంపెనీలకు అవసరం.
చూడాలి మరి ఈ పెంచిన సుంకాన్ని స్మార్ట్ ఫోన్ తయారు చేసే కంపెనీలు వినియోగదారులపై ఏమాత్రం రుద్దుతాయో...? ఏది ఏమైనా భారతదేశ ప్రభుత్వం ఆత్మ నిర్బర్ అనే కార్యక్రమం ద్వారా స్వదేశంలో తయారయ్యే వస్తువులను ప్రోత్సహించే దిశగా మంచి ఆలోచనే తీసుకుంది. భారతదేశం లాంటి పెద్ద మార్కెట్ ను క్యాష్ చేసుకోవడానికి విదేశాల నుంచి అనేక కంపెనీలు భారతదేశంలో కంపెనీలు స్థాపించి వారి కార్యకలాపాలను మన దేశం నుండే ప్రారంభించడం ఎంతో ఆనందించాల్సిన విషయమే. ఈ విషయం వల్ల మన భారత దేశంలో ఎంతో మందికి ఉపాధి అవకాశం కూడా లభిస్తుంది. అంతేకాదు భారత దేశంలో తయారయ్యే ఎలక్ట్రానిక్ వస్తువులు ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే వెసులుబాటు దొరుకుతుంది.