రిలయన్స్ ఇండస్ట్రీస్ సంబంధించి రిలయన్స్ జియో లో అనేక కంపెనీలు పోటీ మరి వాటాను కొనుగోలు చేస్తున్నాయి. ఇకపోతే తాజాగా రిలయన్స్ రిటైల్ సంబంధించి gic అనే కంపెనీ రూ. 5512 కోట్లతో 1.2 శాతం వాటాను కొనుగోలు చేసింది. అలాగే అమెరికా దేశానికి సంబంధించిన tpg సంస్థ రిలయన్స్ రిటైల్ లో రూ. 1837 కోట్లను ఖర్చు చేసి 0.4% వాటాను కొనుగోలు చేసింది. ఈ మాటల కారణంతో ప్రస్తుతం రిలయన్స్ మార్కెట్ విలువ రూ. 4.28 లక్షల కోట్లకు చేరుకుంది.
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలు ఆర్థిక వ్యవహారాలతో దివాళా తీస్తుంటే మరోవైపు ముఖేష్ అంబానీ మాత్రం విదేశీ పెట్టుబడులను అయస్కాంతంలా ఆకర్షిస్తూ.. రిలయన్స్ లో వాటాలను కొనుగోలు చేయడానికి కడుతున్నాయి విదేశీ కంపెనీలు. ఇక గత 20 రోజుల్లో ప్రపంచ దేశాల్లోని వివిధ కంపెనీలు సిల్వర్ లేక్, కేకేఆర్, అట్లాంటిక్, ముబదల లాంటి కంపెనీలు రిలయన్స్ రిటైల్ లో వేల కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. మరికొన్ని కంపెనీలు రిలయన్స్ ఇండస్ట్రీ లో ఇన్వెస్ట్ చేస్తామని కూడా ప్రకటించారు.