రైతుల ఆత్మ హత్యలను తగ్గించే దిశగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నారు.. రైతుల ఆదాయాన్ని పెంచేలా చేస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అంటున్నారు.  ఈ మేరకు 2022 కు వారి ఆదాయాన్ని రెట్టింపు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం పలు రకాల స్కీమ్స్ అందిస్తోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ఇందుకు మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మోదీ సర్కార్ ఈ స్కీమ్ మాత్రమే కాకుండా మరో అదిరిపోయే సదుపాయాన్ని కల్పిస్తుంది.



అదేంటంటే .. కుసుమ స్కీమ్ ( సోలార్ స్కీమ్ ) ఈ పథకంలో భాగంగా రైతులు వారి పొలంలో సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకొని మంచి రాబడి పొందొచ్చు. సోలార్ కంపెనీలు దీనికి గానూ రైతులకు అద్దె చెల్లిస్తాయి.. అది లేదంటే మీరే సోలార్ సిస్టమ్ ద్వారా కరెంట్ ను ఉత్పత్తి చేసుకొని అమ్మవచ్చు.. ఒకవేళ మేము చేసుకోలేము అనుకునేవారికి మరో అద్భుతమైన అవకాశం కూడా ఉంది.అదే సోలార్ కోసం భూమిని అద్దెకు ఇవ్వడం. ఇలా చేయడం వల్ల ఎటువంటి పెట్టుబడులు లేకుండా ఏడాదికి లక్ష రూపాయలను సోలార్ కంపెనీలు చెల్లుస్తాయి..



అయితే దీనికి అగ్రిమెంట్ ఉంటుంది. 25 ఏళ్ల పాటు పొలాన్ని అద్దెకు ఇవ్వాలి. అంటే కంపెనీలు మీకు 25 ఏళ్ల పాటు సోలార్ ప్యానెల్స్ కోసం అద్దె చెల్లిస్తూనే వస్తాయి. 25 ఏళ్ల తర్వాత రైతులకు ఏకరాకు రూ.4 లక్షల అద్దె లభిస్తుంది.అయితే దీనికి అగ్రిమెంట్ ఉంటుంది. 25 ఏళ్ల పాటు పొలాన్ని అద్దెకు ఇవ్వాలి. అంటే కంపెనీలు మీకు 25 ఏళ్ల పాటు సోలార్ ప్యానెల్స్ కోసం అద్దె చెల్లిస్తూనే వస్తాయి. 25 ఏళ్ల తర్వాత రైతులకు ఏకరాకు రూ.4 లక్షల అద్దె లభిస్తుంది... ఒకవేళ సోలార్ స్కీమ్ ను పొలంలో పెట్టుకోవాలని భావిస్తే వాళ్ళు సోలార్ స్కీమ్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు..కేవలం రైతులు మాత్రమే కాకుండా భూమి కలిగిన వారు కూడా వారి భూమిని సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు అద్దెకు ఇవ్వొచ్చు. 1 MW సోలార్ ప్లాంటు ఏర్పాటుకు 6 ఎకరాల భూమి అవసరం అవుతుంది. దీని ద్వారా 13 లక్షల యూనిట్ల ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేయొచ్చు... ఎటూ చూసుకున్న కూడా దీని వల్ల బెనిఫిట్స్ ఉంటాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: