గూగుల్ పే యూజర్లకు భారీ శుభవార్తను అందిస్తుంది.. అదేంటో ఇప్పుడు చూద్దాం.. మరింత కొత్తగా గూగుల్ యాప్‌ను కస్టమర్లకు అందుబాటు లోకి తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. అంతే కాకుండా కోబ్రాండెడ్ డెబిట్ కార్డులను కూడా కస్టమర్లకు అందించేందుకు రెడీ అవుతోంది. గూగుల్ పే ఇప్పటికే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.. అంతేకాకుండా గూగుల్ తన గూగుల్ పే ద్వారా డిజిటల్ బ్యాంక్ అకౌంట్ సర్వీసులు కూడా అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఈరోజు నిర్వహించిన గూగుల్ పే కార్యక్రమం లో కొత్త కొత్త విషయాలను వెల్లడించారు.. ఇప్పటివరకు గూగుల్ పే సేవలు ప్రజలకు బాగా నచ్చాయి.. అందుకే ఈ యాప్ ను వాడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది.ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో కొత్త ప్రయోగం చేయబోతున్నట్లు వెల్లడించారు.. ఈ యాప్ వల్ల ప్రజలకు చాలా లాభాలు ఉంటాయని అంటున్నారు.. ఇందులోనే కొత్త గూగుల్ యాప్‌ను కంపెనీ ఆవిష్కరిస్తుంది. ఇంకా ఎలాంటి కొత్త సర్వీసులు అందుబాటు లోకి తీసుకువస్తుందో వెల్లడిస్తుంది. కో బ్రాండెడ్ డెబిట్ కార్డులు, రివార్డ్ ప్రోగ్రామ్స్ వంటివి ఉండొచ్చనే అంచనాలు పెరుగుతున్నాయి.. గూగుల్ పే వినియోగ దారుల సంఖ్య కూడా పెరుగుతుందని అంచనా..