రుణాలు తీసుకోవాలని చాలా మంది అనుకుంటారు..  ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అలాంటివి మరి
 కరోనా మహమ్మారి కారణంగా ఆర్ధిక ఇబ్బందులు తలెత్తాయి.. ముఖ్యంగా చెప్పాలంటే చాలా మంది రోడ్డున పడ్డారు.. అయితే బ్యాంకులలో లోన్స్ తీసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.. అందుకే బ్యాంకులు కూడా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అతి తక్కువ ధరలకే వడ్డీతో రుణాలను అందిస్తున్నారు. దాంతో చాలా మంది కొత్త బిజినెస్ లు చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. 




పర్సనల్ లోన్ కన్నా కూడా సొంతింటి కోసం లోన్ తీసుకోవాలని అనుకుంటారు.. అలాంటి వారి కోసం కొన్ని బ్యాంకులు అదిరిపోయే రుణాలను అందిస్తుంది.. వివరాల్లోకి వెళితే.. తాజాగా ఒక బ్యాంక్ హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో చాలా మందికి ఊరట కలుగనుంది.ప్రభుత్వ రంగానికి చెందిన యూకో బ్యాంక్ తాజాగా కస్టమర్లకు వడ్డీ రేట్ల తగ్గింపు బెనిఫిట్ కల్పించింది. హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లను 0.25 శాతం మేర తగ్గించేసింది. హోమ్ లోన్స్‌పై కొత్త వడ్డీ రేట్లు నవంబర్ 18 నుంచే అమలులోకి వచ్చాయని బ్యాంక్ తెలిపింది..



లోన్ల పై వడ్డీ రేట్లను పూర్తిగా తగ్గించే విధంగా యుకో బ్యాంక్ అన్నీ రకాల సదుపాయాలను అందిస్తుంది.. ఇప్పుడు ఈ బ్యాంకులో లోన్ తీసుకొనే వాళ్ళకు 6.9 శాతం నుంచే ప్రారంభమౌతున్నాయి. ప్రస్తుతం దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా sbi కూడా 6.9 శాతం నుంచే కస్టరమ్లకు హోమ్ లోన్స్ అందిస్తోంది.యూకో బ్యాంక్ రేట్ల కోత తగ్గింపు కారణంగా ఎస్‌బీఐతో సమాన వడ్డీ రేటుతో యూకో బ్యాంక్ కూడా రుణాలు అందిస్తోంది. ఈ దెబ్బతో యూకో బ్యాంక్ పై వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు.. దెబ్బకు ఎస్బీఐ లోన్ శాతం పూర్తిగా పడిపోయిందని చెప్పాలి..మీరు లోన్ తీసుకోవాలని అనుకునేవారికి ఈ లోన్లు తీసుకోవడం మేలు..


మరింత సమాచారం తెలుసుకోండి: