ఈ మేరకు అని ఎయిర్ టెల్ చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ రాహుల్ వాట్స్ ఓ లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో తాము అలాంటి దాడులకు పాల్పడే అవకాశమే లేదని, అలా ప్రత్యర్థులపై దాడులు చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవారమని, ఇలాంటి ఫిర్యాదులు జియోకు కొత్తేం కాదని, గతంలో కూడా ఇలాంటి ఫిర్యాదులే చేసిందని పేర్కొన్నారు. 25 సంవత్సరాలుగా మార్కెట్లో వినియోగదారులకు సేవలందిస్తున్నామని, అంతిమంగా వినియోగదారులకు మంచి సేవలు చేరాలనేదే తమ లక్ష్యమని, జియో టవర్లను ధ్వంసం చేయడాన్ని తాము కూడా ఖండిస్తున్నామని తన లేఖలో పేర్కొన్నారు.
‘రైతుల ఆందోళన వెనుక ఎయిర్‌టెల్ ఉందని జియో ఆరోపించడం సరికాదు. ఒకవేళ అదే ఆలోచన తమకుంటే మూడేళ్ల క్రితమే ఆ పని చేసి ఉండేవాళ్లం. అలా జరిగి ఉంటే జియోలో అంతమంది వినియోగదారులు చేరి ఉండేవారు కాదు. ఇంత పెద్ద కంపెనీగా ఎదిగేదీ కాదు’ అంటూ పేర్కొ్న్నారు. అభిప్రాయపడింది.
మరోవైపు ఒడాఫోన్ ఐడియా కూడా జియో ఆరోపణలను ఖండించింది. తప్పుడు ఆరోపణలు, జియో తమపై ఎటువంటి ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తోందని వొడాఫోన్ ఐడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. తమను దెబ్బ తీసేందుకు జియోనే కావాలని ఇలాంటి అసత్యాలను ప్రచారం చేస్తోందని మండిపడింది.