ప్రస్తుతం గ్యాస్ వినియోగదారులు ఎక్కువ అవుతున్నారు. ఫలితంగా గ్యాస్ ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ఇందుకు కారణం గ్యాస్ ను ఎక్కువగా వినియోగించడమే.గ్యాస్ వినియోగం ఎక్కువైనప్పుడు గ్యాస్ నిల్వలు తగ్గిపోవడం సహజం. అందుకే ఎప్పటికప్పుడు గ్యాస్ ధరలు పెరుగుతూనే ఉంటాయి. సామాన్యులకు అందని స్థాయిలో గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి వారి కోసమే ఎల్పీజీ ఇప్పుడు ఒక శుభవార్తను తీసుకొచ్చింది. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారికి రూ.50 రూపాయల వరకు అదనంగా తగ్గిస్తామని చెప్పింది.

అయితే ఇది అందరికీ చెల్లదని కూడా సూచిస్తోంది. ఇది కేవలం ఎవరైతే ఐసిఐసిఐ బ్యాంక్ ప్యాకెట్స్ వాలెట్ ద్వారా గ్యాస్ బుకింగ్ చేసుకుంటారో, వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని సమాచారం. అయితే ఈ గ్యాస్ బుకింగ్ ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా ఎలా చేసుకోవాలో? ఇప్పుడు చూద్దాం.

ఈ ఆఫర్ జనవరి నెలలో బుకింగ్ చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందట. గ్యాస్ బుకింగ్ ద్వారా క్యాష్ బ్యాక్ పొందాలనుకునేవారు PMRJAN2021 ఈ ప్రోమో కోడ్ ని  ఉపయోగించి క్యాష్బ్యాక్ ను పొందవచ్చు. అయితే జనవరి 25 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందరికీ అందుబాటులో ఉంటుంది.ఇందుకోసం ఏం చేయాలో?ఇప్పుడు చూద్దాం.

ముందుగా ఐ మొబైల్ యాప్ ను ఓపెన్ చేసి, పాకెట్స్  వాలెట్ లోకి వెళ్ళాలి.
పే బిల్స్ పై నొక్కాలి.
ఇక్కడ మోర్ ఆప్షన్ కనిపిస్తుంది.
మీ బిల్లర్ ని ఎంచుకోవాలి.
ఎల్పిజీ  ఆప్షన్ కనిపిస్తుంది.
మీ గ్యాస్ సిలిండర్ కంపెనీ ఎంచుకోవాలి.
ఇప్పుడు మీ గ్యాస్ బుకింగ్ కు అనుసంధానం చేయబడిన మొబైల్ నెంబర్ ను లేక కన్స్యూమర్ ఐ డీ ని ఎంటర్ చేయాలి.
ఇప్పుడు ప్రోమో కోడ్ ని ఎంటర్ చేసి,గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలి.
మీ క్యాష్ బ్యాక్ డబ్బులు రూ.50 రూపాయలు 10 రోజుల లోపు మీ వాలెట్ కు జమ చేయబడతాయి.ఇంకెందుకు ఆలస్యం L.P.G ప్రకటించిన ఆఫర్ అందుకోండి

మరింత సమాచారం తెలుసుకోండి: