మరో విషయమేంటంటే ఎస్బీఐ కస్టమర్లకు , ఉద్యోగస్తులకు కూడా లోన్స్ తీసుకోవడం పై మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయట.. జనవరిలో లోన్ తీసుకొనే వారికి ప్రత్యేక స్కీమ్ లు కూడా ఉన్నాయని అంటున్నారు.స్టేట్ బ్యాంక్ తో మహీంద్రా లైఫ్ స్పేస్ డెవలపర్స్ భాగస్వామ్యం వల్ల రెండు సంస్థల కస్టమర్లకు సులభం గానే హోమ్ లోన్స్ వస్తాయి అని అన్నారు మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ అర్వింద్ సుబ్రమణియమ్ వెల్లడించారు.
లోన్స్ విషయంలో తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్న ఎస్బీ ఐ బ్యాంక్ ఇప్పుడు ఇలాంటి లోన్స్ కూడా ఇవ్వడం పై చాలా మంది బ్యాంక్ కష్టమర్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కస్టమర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే కస్టమర్లకు సులభం గానే హోమ్ లోన్స్ వస్తాయి. అలానే సొంతింటి కల కూడా నెరవేరుతుంది. స్టేట్ బ్యాంక్ ఇప్పటికే మహీంద్రా లైఫ్ స్పేస్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. బెంగళూరు, పూణే, చెన్నై, నాగ్‌పూర్ వంటి ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు ఉన్నాయని పేర్కొన్నారు. స్టేట్ బ్యాంక్ కి చెందిన రియల్ ఎస్టేట్ విభాగం హెడ్, చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ లోన్స్ తీసుకోవడం వల్ల ఇన్స్యూరెన్స్ కూడా ఉచితంగా లభిస్తుందని సమాచారం.. ఇప్పటికే ఎస్బిఐ కష్టమర్లకు మంచి ఆఫర్లను అందిస్తుంది.