కరోనా కారణంగా ఆర్ధిక ఇబ్బందులతో చాలా మంది ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగాలు కూడా కోల్పోయారు. అందులో కొంతమంది మళ్లీ ఉద్యోగాల్లో చేరుతున్నారు. కాగా, చాలా మంది ఉద్యోగాలు లేక తిరుగుతున్నారు.అయితే కొందరు మాత్రం సొంతంగా ఏదైనా చిరు వ్యాపారాలు చేసుకోవాలని అనుకొనే వారి కి ఇలాంటి
బిజినెస్ మంచి లాభాలను పొందవచ్చు. ఇది ప్రారంభించడానికి చాలా తక్కువ పెట్టుబడి అవసరం. కానీ ఇందులో లాభాలు చాలా బలంగా ఉన్నాయి. మీరు ఈ వ్యాపారాన్ని కేవలం 50 వేల రూపాయలకు ప్రారంభించవచ్చు. దీని నుండి మీరు ప్రతి నెలా 30 నుండి 40 వేల రూపాయలు సంపాదించవచ్చు.
ప్రింటెడ్ టీ షర్ట్ వ్యాపారం..
ఈ రోజుల్లో ఇలాంటి వ్యాపారం చేస్తే మంచి లాభాలను పొందవచ్చు. అదేలానో ఇప్పుడు చూద్దాం..టీ-షర్టులను చిన్న స్థాయిలో ముద్రించే వ్యాపారం ఇది. పుట్టినరోజు సందర్భంగా, ప్రజలు తమ స్నేహితులకు లేదా బంధువులకు కొన్ని ప్రత్యేక బహుమతులు ఇవ్వాలనుకుంటారు. అలాంటి వారికి ఈ
బహుమతి ఉత్తమమైనది. అలాగే, పాఠశాలలు, కంపెనీలు మరియు కొన్ని ఇతర సంస్థలు ఇటువంటి ప్రత్యేక టీ-షర్టులను ముద్రిస్తాయి. ఒక్కసారి ఈ
బిజినెస్ లో ఆర్డర్లు పొందితే ఇక తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన పరిస్థితి లేదు..
ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి 50- 70 వేలు సరిపోతుంది.ఇదే పెట్టుబడిలో మీరు నెలకు 30-40 వేల రూపాయల వరకు సంపాదించవచ్చు. అయితే ముందుగానే మీరు కనుక మంచి కాంట్రాక్ట్స్ అందుకుంటే మాత్రం దాన్ని మీరు కేక్ మీద ఐసింగ్ పరిగణించండి. మీ ఆదాయాలు వేల రూపాయల నుండి లక్షల రూపాయలకు చేరుతాయి. మీరు సోషల్
మీడియా మరియు ఇ-కామర్స్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో అమ్మడం ప్రారంభిస్తే, మీ ఆదాయాలు మరింత పెరుగుతాయి.. ఒక్కసారి మంచి
మార్కెట్ ఏర్పడితే ఇక లాభాలే లాభాలు.. మీకు నచ్చినట్లయితే మీరు మొదలు పెట్టండి.. లాభాలను పొందండి.