సొంత స్కూటర్ కొనాలని చాలా మంది అనుకుంటారు. అయితే ఎటువంటి స్కూటర్ కొనాలి.. నెలకు ఎంత కడితే మంచిది అనే అంశాలను ఇప్పుడు చూద్దాం.. ఇప్పుడు ఒక చక్కటి వార్త వినపడుతుంది. అతి తక్కువ డౌన్ పేమెంట్ తో స్కూటర్ ను కొనుగోలు చేసే వెసులు బాటు ఉంది.బైక్ కాకుండా స్కూటర్ ఇంటికి తీసుకెళ్లాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీ కోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. తక్కువ డౌన్ పేమెంట్ తోనే మీరు ఈ స్కూటర్ ఇంటికి తీసుకెళ్లొచ్చు. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్స్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారికి అదిరిపోయే ఆఫర్ అందిస్తోంది.
అతితక్కువ డౌన్ పేమెంట్ బెనిఫిట్ కల్పిస్తోంది. వివరాల్లోకి వెళితే.. టీవీఎస్ కంపెనీ అదిరిపోయే ఆఫర్లను అందిస్తుంది..
టీవీఎస్ జుపిటర్ ను కొనుగోలు చేసేవారికి శుభవార్త..
టీవీఎస్ జుపిటర్ స్కూటర్ పై అదిరిపోయే ఆఫర్ ఉంది. తక్కువ బడ్జెట్‌లోనే ఈ వెహికల్ తీసుకెళ్లొచ్చు. రూ.10,999 డౌన్ పేమెంట్‌తో ఈ స్కూటర్ కొనుగోలు చేయొచ్చు. ఇది కాకుండా మరో ఆఫర్ కూడా అందుబాటు లో ఉంది. ఆకర్షణీయ ఈఎంఐ ఫైనాన్స్ సదుపాయం కూడా లభిస్తోంది.
కేవలం నెలకు రూ. 2,222 ఈఎంఐ తో ఈ స్కూటర్ ఇంటికి తీసుకెళ్లొచ్చు. అయితే ఇక్కడ ఆఫర్ వివరాలు షోరూమ్ ప్రాతిపదికన మారుతూ ఉండొచ్చు. అందువల్ల మీరు మీ దగ్గరిలోని టీవీఎస్ షోరూమ్‌కు వెళ్లి ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇకపోతే
టీవీఎస్ జుపిటర్ స్కూటర్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.63,497గా ఉంది. ఇందులో 110 సీసీ ఇంజిన్ ఉంటుంది.. తక్కువ పేమెంట్ తో ఈ స్కూటర్ ను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ వార్త విన్న యువత ఈ స్కూటర్ ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
మార్కెట్ లో డిమాండ్ కూడా భారీగా పెరిగింది.