న్యూఢిల్లీ: ఆంధ్రాబ్యాంక్, సిండికేట్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ వంటి బ్యాంకుల్లో ఖాతాలున్నాయా..? అయితే మీ ఖాతాలకు సంబంధించి ఓ కీలక విషయం తెలుసుకోండి. ఇక మీదట మీ బ్యాంకు ఖాతాలు పూర్తిగా మారిపోబోతున్నాయి. మీ పాస్‌బుక్ చెల్లదు. మీ చెక్ బుక్ చెల్లదు. దీనికి కారణం గతేదాడి ఈ బ్యాంకులన్నింటింనీ పెద్ద పెద్ద బ్యాంకుల్లో విలీనం చేయడమే కారణం. ఈ ఆర్థిక సంవత్సరంతో విలీనం ప్రక్రియ పూర్తి కానుండడంతో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి విలీనమైన బ్యాంకులకు సంబంధించిన వివరాలు పూర్తిగా తొలగించనున్నారు. దీంతో ఆయా బ్యాంకుల చెక్ బుక్‌లు, పాస్ బుక్‌లు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లు మారిపోనున్నాయి. అయితే బ్యాంకు ఖాతా నెంబరు, కస్టమర్ ఐడీ మాత్రం పాతవే కొనసాగనున్నాయి.

2020-2021 ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనున్నందున ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ మార్పులన్నీ అమలులోకి రానున్నాయి. మొబైల్‌ బ్యాంకింగ్‌ వినియోగదారులకు కూడా పాత బ్యాంకు అప్లికేషన్లు పనిచేయవని, అందువల్ల కొత్త బ్యాంకు అప్లికేషన్లు ఇన్‌స్టాల్ చేసుకోవాలని బ్యాంకింగ్ వర్గాలు కోరుతున్నాయి.

మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది ఖాతాదారులున్న ఆంధ్రాబ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని రకాల కార్యకలాపాలూ యూనియన్ బ్యాంకు కేంద్రంగానే నిర్వహించనున్నట్లు ఆంధ్రాబ్యాంకు యాజమాన్యం పేర్కొంది. ఖాతాదారులు ఈ విషయాన్ని గమనించి ఏమైనా సందేహాలు ఉంటే యూనియన్‌ బ్యాంకు కస్టమర్‌ కేర్‌ నంబర్‌ 18002082244ను సంప్రదించాలని కోరింది.

ఇదిలా ఉంటే యూనియన్ బ్యాంకులో ఆంధ్రా బ్యాంకుతో పాటు కార్పొరేషన్ బ్యాంకు కూడా కూడా విలీనం కానుంది. గతేడాది కేంద్ర ఉత్తర్వుల ప్రకారం.. ఇది మాత్రమే కాకుండా.. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల విలీనం పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరగనుంది. సిండికేట్ బ్యాంకు కెనరాబ్యాంకులో విలీనం కానుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంక్, విజయా బ్యాంకులు విలీనం కానున్నాయి. ఇండియన్ బ్యాంకులో అల్లహాబాద్ బ్యాంకు విలీనం కానుంది. వీటన్నింటితో పాటు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వం రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా ఆ బ్యాంకుకు సంబంధించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ తదితర శాఖలన్నీ విలీనం కానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: