తక్కువ ఖర్చుతో క్రికెట్ బంతిని తయారు చేయడానికి పరి శ్రమను ఏర్పాటు చేసుకుంటే ఈజీగా డబ్బుల్ని సంపాదించొచ్చు.ఆట వస్తువులని మార్కెట్ లో ఎప్పుడూ కొనుక్కుంటూనే వుంటారు. అందుకే మీరు ఈ క్రికెట్ బాల్ బిజినెస్ చేస్తే ఎప్పుడు మంచి లాభాలే వస్తాయి. ఈ వ్యాపారానికి తోలు, దారం, పోలిష్ మరియు ఉన్ని ఉపయోగించబడతాయి. దీని కోసం కొన్ని ప్రత్యేక యంత్రాల ను కూడా ఉపయోగిస్తారు. అలానే పని చేయడానికి కార్మికుల్ని, మార్కెటింగ్ చేయడానికి ఉద్యోగుల్ని కూడా పెట్టుకోవాల్సి వుంటుంది..
ఐదు లక్షలు పెట్టుబడి పెట్టాలి.. ఓ వ్యక్తి ఈ బిజినెస్ ను మొదలు పెట్టగా 4 లక్షల 23 వేలు పెట్టుబడి కింద పెట్టాడు. ఇలా ఇంత డబ్బు తో క్రికెట్ బాల్ తయారీ యూనిట్‌ను స్టార్ట్ చేసేయొచ్చు. అంత పెట్టుబడి పెట్టారనుకోండి అప్పుడు సుమారు 90 వేల బంతులను తయారు చేయవచ్చు మరియు దీని పై మీ మొత్తం ఉత్పత్తి వ్యయం సుమారు 18 లక్షల రూపాయలకు వస్తుంది. మీ అంచనా అమ్మకాలు 20 లక్షల రూపాయలు.. ఇలా ఒక లెక్క ప్రకారం బిజినెస్ చేస్తే నెలకు రెండు లక్షలకు పైగా సొంతం చేసుకోవచ్చు..