ప్రభుత్వ బ్యాంకులు అన్నీ కూడా వినియోగదారులకు అదిరిపోయే శుభ వార్తలు అందిస్తున్నారు. ముఖ్యంగా లోన్స్ తీసుకునే వారికి మరీ ఎక్కువగా. ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకు లలో మూడో బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ కూడా తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది.ప్రభుత్వ రంగానికి చెందిన మూడో అతిపెద్ద బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా రుణ గ్రహీతలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. రెపో లింక్డ్ లెండింగ్ రేటు బిఆర్ఎల్ఎల్ఆర్ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రుణ గ్రహీతలకు ప్రయోజనం కలుగనుందనీ వెల్లడించింది..


బ్యాంక్  రుణ రేట్లలో 10 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. దీంతో బీఆర్ఎల్ఎల్ఆర్ 6.85 శాతం నుంచి 6.75 శాతానికి దిగొచ్చింది. రేట్ల తగ్గింపు నిర్ణయం ఈరోజు నుంచే అమలు లోకి వచ్చింది. రేట్ల కోత కారణంగా అన్ని రిటైల్ లోన్స్ ‌పై వడ్డీ రేట్లు అందుకు అనుగుణంగా చెల్లింపు చేయనున్నారు. గత రెండు ప్రభుత్వ బ్యాంకు ల మాదిరి గానే ఈ బ్యాంక్ కూడా అన్నీ వాటి పై రుణాలను అందిస్తుంది.


హోమ్ లోన్, కార్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, పర్సనల్ లోన్ వంటివి తీసుకుంటున్న వారికి బెనిఫిట్ కలుగనుంది. బ్యాంక్ తాజా నిర్ణయంతో హోమ్ లోన్ ‌పై వడ్డీ రేటు 6.75 శాతం నుంచి ప్రారంభమౌతోంది. కార్ లోన్ 7 శాతం నుంచి స్టార్ట్ అవుతోంది. ఎడ్యుకేషన్ లోన్ వడ్డీ రేటు కూడా 6.75 శాతం నుంచి ప్రారంభమౌతోంది. బీఆర్ఎల్ఎల్ఆర్ రేటు కోత కారణంగా బ్యాంక్ రుణ రేట్లు మరింత అందుబాటు లోకి వచ్చినట్లు ఉంటుందని బ్యాంక్ ఆఫ్ బరోడా జీఎం హర్షద్ కుమార్ పేర్కొన్నారు. కస్టమర్ల కు ఈ పద్దతి ద్వారా మరింత లబ్ది చేకూరుతుంది అంటూ ఆశా భావం వ్యక్తం చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: