జీఎస్టీ ఈ నెల వసూళ్లలో సరికొత్త రికార్డును సృష్టించింది.నెలలో రూ.1.25 లక్షల కోట్ల నుంచి రూ.1.30 లక్షల కోట్ల వరకు ఉంటుందని అధికారుల అంచనా. అందులోనూ ఆర్థిక సంవత్సరం చివరి నెల కావడంతో జీఎస్టీ వసూళ్లు పెరుగనున్నాయి. విషయానికొస్తే.. 2017 జూలైలో జీఎస్టీ అమల్లోకి వచ్చింది. 2017 జూలై -2018 మార్చి మధ్య మొత్తం వసూళ్లు రూ.7.40 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2018 ఏప్రిల్-2019 మార్చి మధ్య వసూళ్లు రూ.11.77 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇది 2019 ఏప్రిల్-2020 మార్చి మధ్య రూ.12.22 లక్షల కోట్లు. 2020 ఏప్రిల్-2021 ఫిబ్రవరి మధ్య రూ.10.22 లక్షల కోట్ల వరకు జరిగినట్లు తెలుస్తోంది..


గడిచిన ఐదు నెలల నుంచి ఎప్పుడు లక్ష కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఈ ఏడాది మొదటి నెలలో అత్యధిక వసూళ్లు సాధించింది. ఈ నెలలో రూ.1,19,847 కోట్లు వసూలు చేశారు. గత 6 నెలల్లో కరోనా సమయంలో జీఎస్టీ బృందం, ఆర్థిక మంత్రిత్వ శాఖ భారీ జీఎస్టీ దొంగతనాలను నిరోధించాయని నిపుణులు అంటున్నారు. జీఎస్టీ వసూళ్లు పెరుగడానికి ఇదే కారణం అని నిపుణులు సూచిస్తున్నారు. నకిలీ ఇన్‌పుట్‌ల ద్వారా క్రెడిట్ తీసుకునేవి. ఇలాంటి మోసాలను నివారించడానికి జీఎస్టీ బృందం తన ఐటీ వ్యవస్థను బలోపేతం చేసింది. ఇది కాకుండా, దాని బృంద సభ్యులు ప్రతి రాష్ట్రంలోని పెద్ద ఎత్తున కంపెనీలను పరిశీలిస్తున్నారు.


2017 లో ఈ వస్తు పన్ను వసూలు ను అమల్లోకి తీసుకువచ్చినా కూడా వరుసగా 5 నెలలు రూ.1 లక్ష కోట్లకు పైగా ఉండటం ఇదే మొదటిసారి. అలాగే, ఏ నెలలోనైనా అత్యధిక సేకరణ ఈ ఏడాది జనవరిలోనే ఉన్నది. జీఎస్టీ వసూళ్లు అక్టోబర్‌లో రూ.1.05 లక్షల కోట్లు, నవంబర్‌లో రూ.1.04 లక్షల కోట్లు, డిసెంబర్‌లో రూ.1.15, జనవరిలో రూ.1.19, ఫిబ్రవరిలో రూ.1.13 లక్షల కోట్లు వసూలయ్యాయి. మార్చిలో ఇప్పటివరకు ఈ సంఖ్య రూ.1.25 లక్షల కోట్లుగా తెలుస్తుంది. అయితే మరో వారంలో ఈ ఏడాది ఆర్ధిక సంవత్స రం ముగియనుంది. ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది ఈ మేరకు వసూళ్లలో సరికొత్త రికార్డును సృష్టించాలని జీఎస్టీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: